ఐపీఎల్ సంగ్రామం మార్చి 22 నుండి ప్రారంభం కానుంది. ఈ సారి 10 జట్లు టోర్నమెంట్‌లో తలపడనుండగా తొలి మ్యాచ్ కోల్ కతా వేదికగా కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మధ్య జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ లవర్స్‌ను ఆకట్టుకున్న ఈ టోర్నమెంట్ విషయానికొస్తే ఇప్పటివరకు అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన బౌలర్లను ఓసారి పరిశీలిస్తే..
ఐపీఎల్‌లో ఓ మ్యాచ్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో వెస్టిండీస్ పేసర్ అల్జారి జోసెఫ్ టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. 2019లో సన్ రైజర్స్ హైదరాబాద్ పై కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చి ఆరు వికెట్లు తీశాడు. పాకిస్తాన్ స్పీడ్‌స్టర్ సోహైల్ తన్వీర్ సైతం 2008లో జరిగిన తొలి ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడిన అతను ఆరు వికెట్లు పడగొట్టాడు.
ఆసీస్ స్పిన్నర్ ఆడం జంపా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ పై ఆరు వికెట్లు తీశాడు. 2009లో ఆర్‌సీబీ తరుపున ఆడిన కుంబ్లే రాజస్థాన్ రాయల్స్ పై ఐదు వికెట్లు తీయగా ముంబై తరఫున ఆకాష్ మధ్వాల్ ఐదు వికెట్లు పడగొట్టాడు. బుమ్రా.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీశాడు. 2011 ఐపీఎల్ సందర్భంగా డెక్కన్ ఛార్జర్స్ తరపున ఆడిన ఇషాంత్ శర్మ కొచ్చిపై మూడు ఓవర్లలో 12 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీసుకున్నాడు. శ్రీలంక ఆటగాడు లసిత్ మలింగ సైతం 5 వికెట్లు తీశాడు.