టీడీపీ అధినేత చంద్రబాబుకు స్వల్ప రిలీఫ్ లభించింది. ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాంలో 16వ తేదీ వరకు అరెస్ట్ చేయవద్దని న్యాయస్ధానం ఆదేశాలు జారీ చేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్లు కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది.
ఈ రెండు కేసుల్లోనూ చంద్రబాబును అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును కోరారు బాబు తరపు న్యాయవాదులు. ఈ కేసుల్లో విచారణకు సహకరిస్తామని తెలిపారు. ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ పెండింగ్‌లో ఉందని …ఈ దశలో బాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని కోరారు. అయితే ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్ధానం రెండు కేసుల్లోనూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.అంగళ్లు కేసులో 12వ తేదీ వరకు, ఐఆర్ఆర్ కేసులో 16వ తేదీ వరకు అరెస్టు చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది.
ఇక ఇప్పటికే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేష్ రెండో రోజు విచారణ జరుగుతుండగా మాజీ మంత్రి నారాయణ అల్లుడు సైతం ఇవాళ విచారణకు హాజరయ్యారు.తొలిరోజు లోకేష్‌ను ప్రధానంగా 30 ప్రశ్నలు అడిగారు సీఐడీ అధికారులు. రాజధాని ప్రాంతంలో లే అవుట్ రిజిస్ట్రేషన్ మినహాయిపు ఎందుకు ఇచ్చారని ,హెరిటేజ్ ఫుడ్స్ మేనేజ్‌మెంట్ కమిటీ, బోర్డు పాత్ర ఏంటి? నిర్ణయాలు ఎవరు తీసుకుంటారు అని ప్రశ్నల వర్షం కురిపించారు.