Sunday, May 4, 2025
- Advertisement -

అరుణమ్మకే పగ్గాలు..బీజేపీ ఫిక్స్!

- Advertisement -

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై ఆ పార్టీ అధిష్టానం ఏం ఆలోచిస్తుంది?, గతంలో ఎన్నడూ లేని విధంగా అధ్యక్షుడి ఎంపికలో ఇంత ఆలస్యం ఎందుకు అవుతుంది?, బీసీనా లేక ఓసీనా ఎవరికి తెలంగాణ బీజేపీ పగ్గాలు దక్కుతాయి. ఇప్పుడు ఇదే కాషాయ పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది.

బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపిక త్వరలో జరగనుండగా ఇప్పటికే గ్రామస్థాయి నుండి బూత్, జిల్లా కమిటీల ఎంపిక పూర్తయింది. ఇక మిగిలింది రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికే. గత మూడు నెలలుగా రాష్ట్ర అధ్యక్షుడు ఎవరవుతారన్న దానిపై బీజేపీ శ్రేణులతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో సైతం ఉత్కంఠ నెలకొంది.అయితే ప్రధానంగా బండి సంజయ్ లేదా ఈటల రాజేందర్ పేర్లు వినపడగా తాజాగా మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ పేరు తెరపైకి వచ్చింది.

దేశాన్ని యూనిట్ గా తీసుకుంటే వాటిలో కొన్ని రాష్ట్రాలకు మహిళా అధ్యక్షురాళ్లను పెట్టాలని బీజేపీ జాతీయ నాయకత్వం భావిస్తున్న నేపథ్యంలో అనూహ్యంగా డీకే అరుణ పేరు తెరపైకి వచ్చింది. దీనికి కారణం పార్టీ అధ్యక్ష పదవి ఆశీస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వారందరిని బుజ్జగించాలంటే మహిళా నేతకే పగ్గాలు అప్పగించడం సరైందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అరుణమ్మ పేరును పరిశీలిస్తున్నారట.

పార్టీ శ్రేణులు కూడా వివిధ గ్రూపులుగా విడిపోవడం, ఒకరికి అధ్యక్ష పదవి వస్తే మిగితా వారు సపోర్టు చేసే పరిస్థితి లేకపోవడంతో మహిళా నేతకు రాష్ట్ర బాధ్యతలు అప్పగించాలని భావిస్తోంది. ప్రస్తుతం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు అరుణ. అంతేగాదు పార్టీ నాయకత్వంలోనూ మంచిపేరుంది. గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవంపైగా రెడ్డి సామాజికవర్గానికి చెందిన నాయకురాలు రావడంతో ఆ సామాజికవర్గానికి పార్టీని మరింత చేరువ చేస్తుందని భావిస్తున్నారట. అందుకే డీకే అరుణ పేరును పరిగణలోకి తీసుకుంటున్నారని తెలుస్తోండగా దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -