ఫార్ములా ఈ రేసు కేసు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మెడకు చుట్టుకుంది. హైకోర్టులో ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ వేసిన క్యాష్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. అలాగే కేటీఆర్‌ను అరెస్ట్ చేయవద్దంటూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు సైతం ఎత్తి వేయడంతో కేటీఆర్‌కు బిగ్ షాక్ తగిలింది. కేటీఆర్ అరెస్ట్ తప్పదంటూ అప్పుడే ఊహాగానాలు జోరందుకున్నాయి. మరోవైపు ఎల్లుండి ఏసీబీ విచారణకు రావాలని కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో అదేరోజు అరెస్ట్ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇక కేసీఆర్ పిటిషన్ సందర్భంగ చట్టప్రకారం నడుచుకోవాలని, అందరికీ రూల్ ఆఫ్ లా వర్తిస్తుందని హైకోర్టు పేర్కొంది. కేటీఆర్ నివాసానికి బీఆర్ఎస్ నేతలు భారీ సంఖ్యలో చేరుకున్నారు. హరీశ్ రావుతో పాటు ఇతర బీఆర్ఎస్ ముఖ్యనేతలు కేటీఆర్ నివాసంకు చేరుకొని తదుపరి కార్యాచరణపై చర్చలు జరిపారు.
అక్రమ కేసులను న్యాయపరంగానే ఎదుర్కొంటామని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. అక్రమ అరెస్ట్‌లు బీఆర్ఎస్‌కు కొత్త కాదని గతంలో ఉద్యమ సమయంలోనూ కేటీఆర్ జైలుకు వెళ్లారని గుర్తు చేశారు హరీశ్. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీల అమలు పక్కదారి పట్టించేందుకే అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు హరీశ్.