తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల సమరం ముగియగా ఇప్పుడు తెరపైకి కేబినెట్ విస్తరణ అంశం తెరపైకి వచ్చింది. తెలంగాణ రెండో సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత తనతో కలిపి 12 మంది మంత్రులుగా అవకాశం కల్పించారు రేవంత్. ఇక రాజ్యాంగం ప్రకారం తెలంగాణలో కేబినెట్ మంత్రుల సంఖ్య 18కి మించరాదు. దీంతో ఆరుగురికి మాత్రమే ఛాన్స్ ఉండగా దీని కోసం తీవ్ర పోటీ నెలకొంది.
ఈ సారి విస్తరణలో హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలకు ఛాన్స్ దక్కనున్నట్లు తెలుస్తోండగా ఇందులో బీసీ, ముదిరాజ్, మైనార్టీ వర్గాలు ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. కొత్తగా ఆరుగురికి అవకాశం ఇవ్వడంతో పాటు కొంతమంది పాతవారికి ఉద్వాసన తప్పదని తెలుస్తోంది.
ముఖ్యంగా గ్రేటర్ నుండి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేలు ఎవరు లేకపోవడంతో ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి ఛాన్స్ దక్కనున్నట్లు తెలుస్తోంది. ఇక మంత్రి పదవిని ఆశీస్తున్న వారిలో రంగారెడ్డి జిల్లా నుండి రామ్‌మోహన్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి పేర్లతో పాటు దానం నాగేందర్, ఆదిలాబాద్ గడ్డం వివేక్, వినోద్‌లలో ఒకరికి ఛాన్స్ ఉంటుందని సమాచారం. ఆశావాహులు ఇప్పటికే తమ ప్రయత్నాలను ముమ్మరం చేయగా ఫైనల్‌గా ఎవరికి బెర్త్ కన్ఫామ్ అవుతుందో వేచిచూడాలి.