Saturday, May 3, 2025
- Advertisement -

ప్రతిపక్ష నేతకు భద్రతేది?

- Advertisement -

ప్రతిపక్షనేతకు భద్రత కల్పించరా… రేపు నీకు ఇదే పరిస్థితి వస్తే ఏం చేస్తావు చంద్రబాబు అని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ సీఎం జగన్. గుంటూరు మిర్చి యార్డులో రైతుల పరిస్థితిని తెలుసుకున్న అనంతరం మాట్లాడిన జగన్.. చంద్రబాబు పాలనలో ఏ ఒక్క రైతూ సంతోషంగా లేడు. ఏ పంటకూ గిట్టుబాటు లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రతిపక్ష నేతకు భద్రత కల్పించలేని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. మా హయాంలో.. రైతులు నష్టపోకుండా గిట్టుబాటు ధర కల్పించాం. రూ.21 వేల నుంచి రూ. 27 వేల దాకా వచ్చేది. పెట్టుబడి సాయం చేసి రైతులకు అండగా నిలిచాం. వైఎస్సార్‌సీపీ హయాంలో రైతే రాజు. కానీ, కూటమి ప్రభుత్వం రైతును దగా చేసింది. ఈ ప్రభుత్వం పెట్టుబడి సాయం సాయం ఇవ్వలేదు. రైతులకు సున్నా వడ్డీ రాని పరిస్థితి నెలకొందన్నారు.

రైతులను దళారీలకు అమ్మేసే పరిస్థితి కనిపిస్తోంది… ఎరువులను బ్లాక్‌లో కొనాల్సిన పరిస్థితి ఉందన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరవాలి. గుంటూరు మిర్చియార్డుకు కావాలి. రైతుల కష్టాలు తెలుసుకోవాలి. రాబోయే రోజుల్లో రైతులకు అండగా వైఎస్సార్‌సీపీ ఉద్యమిస్తుందని వైఎస్‌ జగన్‌ హెచ్చరించారు.

రాష్ట్రంలో ఎల్లకాలం మీ ప్రభుత్వం ఉండదు. విపక్షంలో మీరు ఉన్నప్పుడు భద్రతా ఇలాగే తీసేస్తే ఎలా ఉంటుంది చంద్రబాబు?. ప్రతిపక్ష నేతకు భద్రత కూడా ఇవ్వరా?. మీరు చేస్తున్నది కరెక్టేనా చంద్రబాబు?. విపక్ష నేత రైతులతో మాట్లాడేందుకు వస్తే పోలీసు భద్రత కూడా ఇవ్వరా? అని ప్రశ్నించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -