- Advertisement -
చంద్రబాబు కుయుక్తులతో ఎన్నికల నేపథ్యంలో ఆగిపోయిన డీబీజీ పథకాలకు నిధుల విడుదల ప్రారంభమైంది. నిన్న ఒక్కరోజే ఆసరాకు రూ.1480 కోట్లు విడుదల చేయగా జగనన్న విద్యాదీవెన కింద సంపూర్ణ ఫీజు రింబర్స్ మెంట్ కు రూ.502కోట్లు విడుదల చేశారు.
మిగిలిన పథకలకూ నిధులు విడుదల కానున్నాయి. రెండు మూడు రోజుల్లో నిధుల విడుదలను పూర్తిచేయనుంది జగన్ ప్రభుత్వం. టీడీపీ ఫిర్యాదులతో పోలింగ్ కు ముందు డీబీటీ కింద నిధుల విడుదలను అడ్డుకుంది ఎన్నికల సంఘం.
ఇదిగో అదిగో అంటూ పోలింగ్ సమయం వచ్చేంతవరకూ అనుమతిపై ఎటూ తేల్చలేదు. ఎన్నికల సంఘం తీరుపై హైకోర్టుకు వెళ్లింది రాష్ట్ర ప్రభుత్వం. ఎన్నికల సంఘం తీరుపై తీవ్రస్థాయిలో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయగా సమయం ముగిసిపోవడంతో పోలింగ్ కు ముందు నిధులు విడుదల కాలేదు. ఇక తాజాగా పోలింగ్ ముగిసిన తర్వాత నిధుల విడుదల ప్రారంభమైంది.