మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మరోసారి తన మంచి మనస్సును చాటుకున్నారు. ప్రమాదానికి గురైన ఓ యువకుడిని కాపాడారు జగన్. పులివెందుల పర్యటన సందర్భంగా కోమన్నూతల గ్రామానికికు చెందిన నరేంద్ర అనే యువకుడు మద్యం మత్తులో నీటిలో పడి ప్రాణాపాయ స్థితిలోకి చేరుకున్నాడు.
వెంటనే 108కి ఫోన్ చేశారు. అయితే సకాలంలో 108 రాలేదు. దీంతో టూ విలర్‌పై ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో చిన్న కుడాల గ్రామస్తులతో మాట్లాడేందుకు జగన్ ఆగారు. ఈ సమయంలో ద్విచక్ర వాహనంపై ప్రాణపాయ స్దితిలో ఉన్న యువకుడు నరేంద్రను తరలిస్తున్న విషయాన్ని జగన్ గమనించి.. వెంటనే తన కాన్వాయ్‌లో ఉన్న 108 వాహనంలో ఆ యువకుడిని ఆస్పత్రికి తరలించేలా జగన్ ఏర్పాట్లు చేశారు.
ఆక్సిజన్ సహాయంతో పులివెందులలోని మెడికల్ కళాశాలకు తరలించడంతో నరేంద్ర ప్రాణాలతో బయటపడ్డాడు. దీంతో స్థానికులు జగన్ సార్ అంటేనే మంచి అని కొనియాడారు.