Saturday, May 3, 2025
- Advertisement -

కాలర్ ఎగరేసి చెప్పండి..వైసీపీ నేతనని!

- Advertisement -

ప్రజల తరపున వైసీపీ ఎప్పుడూ పోరాటం చేస్తూనే ఉందని చెప్పారు మాజీ సీఎం జగన్. నాలుగేళ్ల తర్వాత మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసీపీనేని..ఏ పేదవాడి ఇంటికైనా వైసీపీ కార్యకర్త వెళ్లగలడు అన్నారు. సగర్వంగా తల ఎత్తుకుని, కాలరెగరేసుకుని వెళ్లే సత్తా వైసీపీ కార్యకర్తలకు ఉందన్నారు.

కూటమి ప్రభుత్వం వచ్చాక వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయి అని… సూపర్ సిక్స్ హామీల అమలు కూడా గాలికొదిలేశారు అని మండిపడ్డారు జగన్. ఏపీ వ్యాప్తంగా వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. పార్టీ ఆఫీసులో జెండాను ఆవిష్కరించారు వైఎస్ జగన్.

ఇక కూటమి ప్రభుత్వం ఒక్క హామీని కూడా అమలు చేయలేదు అన్నారు పెద్దిరెడ్డి. ఇంత దారుణమైన పరిపాలన ఎన్నడూ చూడలేదు అని… 10 నెలలు అయినా ఫీజు రీయింబర్స్మెంట్ ఊసే లేదు అన్నారు. ప్రతి విద్యార్థికి చంద్రబాబు రూ.30 వేల రూపాయల బాకీ ఉన్నారు అని… ఫీజు రీయంబెర్స్‌మెంట్ విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు జిల్లాల్లో వైసీపీ యువత పోరు కార్యక్రమం చేపట్టిందన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -