Saturday, May 3, 2025
- Advertisement -

పోరుబాట పట్టాల్సిన సమయం వచ్చేసింది!

- Advertisement -

సూపర్-6 అమలుపై కూటమి నేతల్ని ప్రజలు నిలదీస్తున్నారు అన్నారు మాజీ సీఎం జగన్. ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలతో తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సమావేశమయ్యారు జగన్. ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్‌ చైర్‌ పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు హాజరు అయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడిన జగన్…సమాధానం చెప్పలేక నెలకొక డైవర్షన్ పాలిటిక్స్‌ను కూటమి నేతలు తెరపైకి తీసుకొస్తున్నారు అని మండిపడ్డారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా అంటూ గత కొన్ని రోజులుగా హడావుడి చేస్తున్నారు.. అసలు ప్రభుత్వంలో ఎవరున్నారు? చెప్పాలన్నారు.

మెడికల్ కాలేజీలు, పోర్టులను ఓ పద్ధతి ప్రకారం చంద్రబాబు అమ్మే ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మనం అందరం పోరుబాట పట్టాల్సిన టైమ్ వచ్చేసింది అన్నారు. బాబు షూరిటీ బాదుడు గ్యారెంటీ…సంపద సృష్టిస్తా అన్నాడు..జనాన్ని చార్జీలతో బాదేస్తున్నాడు..ఇదేనా చంద్రబాబు అనుభవం చెప్పాలన్నారు. ఇదేనా మేధావితనం..దీన్ని చూసేనా జనం మోసపోయిందన్నారు. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ.. డిసెంబరు 13న రైతుల కోసం.. రైతులతో కలిసి వైయస్‌ఆర్‌సీపీ ఉద్యమ బాట పట్టనుందన్నారు. అలాగే త్వరలో నిర్వహించే ప్రజా పోరాటాలు, తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్‌ కార్యచరణపై దిశానిర్దేశం చేశారు జగన్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -