Saturday, May 3, 2025
- Advertisement -

అణగారిన వర్గాల ఆశాజ్యోతి..పూలే

- Advertisement -

మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఘ‌న నివాళుల‌ర్పించారు. తాడేప‌ల్లిలోని త‌న నివాసంలో పూలే చిత్రపటానికి వైయ‌స్ జ‌గ‌న్ నివాళుల‌ర్పించారు.

సామాజిక సమానత్వానికి, మహిళా విద్యకు మార్గదర్శకులు జ్యోతిరావు పూలే అని… అణగారిన వర్గాల అభ్యున్నతి, వారి విద్యాభివృద్ధి కోసం జీవితాంతం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త అని కొనియాడారు. ఇవాళ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా నివాళులు అని పేర్కొన్నారు.

సామాజిక కార్యకర్తగా, వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన సంఘ సంస్కర్త పూలే భావి తరాలకు సైతం మార్గదర్శకుడని గుర్తు చేసుకున్నారు. పూలే జయంతి కార్యక్రమంలో మాజీ మంత్రి జోగి రమేష్, మాజీ ఎంపీ మార్గాని భరత్, ఎమ్మెల్సీలు కే ఆర్ జె భరత్, లేళ్ల అప్పిరెడ్డి, ఆర్ రమేష్ యాదవ్, మొండితోక అరుణ్ కుమార్, కృష్ణా జిల్లా జడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక తదితరులు పాల్గొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -