వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌తో సెల్ఫీ తీసుకున్నందుకు ఓ కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకుంది చంద్రబాబు సర్కార్. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఓ మహిళా కానిస్టేబులు్‌కు ఛార్జిమెమో ఇచ్చారు. ఇటీవల గుంటూరు పర్యటనలో భాగంగా జైలులో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను పరామర్శించారు జగన్.
ఈ సందర్భంగా జగన్‌తో సెల్ఫీ తీసుకున్నారు కానిస్టేబుల్ ఆయేషాభాను. దీంతో ఆమెకు ఛార్జీమెమో ఇచ్చారు ఉన్నతాధికారులు. దీంతో ఏపీ ప్రభుత్వ తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఉద్యోగులను వేధించి రాక్షసానందం పొందుతున్నారని మండిపడుతున్నారు ప్రజలు.
జగన్‌కు తాను అభిమానిని అని, ఒక ఫొటో కావాలని అడిడి కుమార్తెతో కలిసి సెల్ఫీ తీసుకున్నానని చెప్పారు ఆ మహిళా కానిస్టేబుల్. జగన్ కూడా నవ్వుతూ సెల్ఫీ ఇవ్వగా ఇందులో తప్పేముందుని కామెంట్ చేస్తున్నారు. ఆయేషా బానుకు ఛార్జిమెమో ఇస్తామని జైలర్ చెప్పడమే కాదు..కమిటీ వేసి దాని ఆధారంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.