టీడీపీ కూటమి వంద రోజుల పాలనలోనే విఫలమైందన్నారు మాజీ సీఎం జగన్. కేసులకు భయపడకుండా ప్రజల తరుపున పోరాటాలు చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఏ ప్రభుత్వంలో మనకు మంచి జరిగింది అన్నదానిపై ప్రతీ ఇంట్లోనూ చర్చ జరుగుతోందన్నారు.
వైసీపీ పాలనలో ఎప్పుడూ ఒక్క ఫిర్యాదు కూడా రాలేదు… ఎప్పుడూ ముఖాన చిక్కటి చిరునవ్వు చూపించాం అన్నారు. చిరునవ్వుల మధ్యే ప్రజలకు మ్యానిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని అమలు చేశాం అన్నారు. బటన్లు నొక్కి నేరుగా పథకాలు ఇచ్చిన పరిస్థితి బహుశా దేశ చరిత్రలోనే లేదు అన్నారు.
మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. మేనిఫెస్టోను ప్రతీ రాజకీయ పార్టీ ఇస్తుంది…. ఎన్నికలయ్యాక దాన్ని చెత్తబుట్టలో వేస్తారు..కానీ మేనిఫెస్టోను బైబిల్, ఒక ఖురాన్, ఒక భగవద్గీత నమ్మి వందశాతం అమలు చేశామన్నారు జగన్. కరోనా లాంటి పరిస్థితుల్లోనూ సంక్షేమాన్ని ఆపలేదన్నారు. మన హయాంలో ఇసుకను అమ్మిన రేటు కన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు అని ఆరోపించారు జగన్. పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఎవరైనా కేసు పెడితే రివర్స్ లో మనపైనే దొంగ కేసులు పెడుతున్నారు అని దుయ్యబట్టారు.