Tuesday, May 6, 2025
- Advertisement -

వంచన,గోబెల్స్ ప్రచారం..చంద్రబాబుకు ఈ రెండే తెలుసు!

- Advertisement -

ఏపీ సీఎం చంద్రబాబుకు వంచన, గోబెల్స్ ప్రచారం ఈ రెండే తెలుసని మండిపడ్డారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన జగన్..అసత్య ప్రచారంలో చంద్రబాబును మించిన వారు లేరన్నారు. అందుకే గవర్నర్‌ చేత అబద్దాలు చెప్పించారన్నారు. సబ్జెక్టు డైవర్షన్‌లో చంద్రబాబును మించి అనుభవం ఉన్నవారు లేరని దుయ్యబట్టారు. రాష్ట్రానికి సంబంధించిన అప్పులపై చంద్రబాబు ఇచ్చిన తప్పుడు లెక్కలపై గవర్నర్‌కు లేఖ రాస్తానని చెప్పారు.

ఏపీలో దుర్మార్గమైన పాలన నడుస్తోందని, ప్రశ్నించే వారిని అణిచివేయడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 52 రోజులుగా హత్యలు, అత్యాచారాలు, ఆస్తుల ధ్వంసం, దాడులు తప్ప మరేమి జరగలేదన్నారు. హామీల గురించి ప్రజలు అడుగుతారనే హత్యలతో ప్రజలను భయబ్రాంతులకు గుర చేస్తున్నారన్నారు. భయానక వాతావరణం సృష్టించారని ఆరోపించారు.

గవర్నర్ ప్రసంగంలో 10 లక్షల కోట్లు అప్పులు అని అపార్థాలు చెప్పించారని తన దగ్గర ఉన్న ఆధారాలన్ని గవర్నర్‌కు పంపిస్తానని చెప్పారు. ఆర్బీఐ, కాగ్ లెక్కల ప్రకారం రాష్ట్రానికి ఉన్న మొత్తం అప్పు 7.48 లక్షల కోట్లు మాత్రమేనన్నారు. ఆర్ధిక ఇబ్బందుల్లోనూ క్రమం తప్పకుండా ఇచ్చిన హామీలు అమలు చేశాం అని తెలిపారు. ప్రతి ఇంటికే సంక్షేమాన్ని అందించామన్నారు. దేశ చరిత్రలో ఇలా 7 నెలల పాటు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టడం ఎక్కడా జరగలేదని..అది చంద్రబాబుతోనే సాధ్యమైందన్నారు.వైసీపీ పాలనలో దిశా చట్టం, దిశా యాప్ ద్వారా మహిళలకు అన్ని రకాలుగా రక్షణ కల్పించాం కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. రెడ్ బుక్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా లోకేష్ హోర్డింగ్స్ పెట్టారు…దీని ద్వారా ప్రజలకు ఏం మేసేజ్ పంపుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -