చంద్రబాబుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని అందుకే ప్రశ్నిస్తే దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు వైసీపీ అధినేత జగన్. మీడియాతో మాట్లాడిన జగన్..టీడీపీ వాళ్లు కిరాతకాలు, దారుణాలు చేస్తున్నారు అని మండిపడ్డారు. ఇలాంటివి చేస్తే ప్రజలు భయపడిపోరని ప్రజలు ఖచ్చితంగా గుణపాఠం చెబుతారన్నారు. పాలనపై ఫోకస్ పెట్టకుండా వైసీపీ కార్యకర్తలపై దాడులు చేయడం ఎంతవరకు సమంజసం అని మండిపడ్డారు.
ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా చంద్రబాబు అమలు చేయడం లేదని, అమ్మఒడి, రైతు భరోసా అన్నీ ఎగ్గొట్టేశారని దుయ్యబట్టారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఎవరూ ప్రశ్నించకూడదనే దాడులతో భయాందోళనకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూళ్లు, చదువులు, ఆస్పత్రులను నిర్వీర్యం చేస్తున్నారని…. లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాడి తప్పిపోయిందన్నారు.
ఏపీలో జరుగుతున్న పరిణామాలను అన్ని రాజకీయ పార్టీల దృష్టికి తీసుకెళ్తున్నామన్నారు. కనీసం గవర్నర్ అయినా పట్టించుకోవాలని విజ్ఞప్తి చేశారు. రైతులు, తల్లులు, విద్యార్థులు ఇలా అందరినీ మోసం చేశారని… గ్రామ స్థాయి నుంచి భయానక వాతావరణం సృష్టించారన్నారు. చంద్రబాబును హెచ్చరించిన జగన్… నంద్యాలలో ఏకంగా చంపేసిన ఘటన చూశాం అన్నారు. వైసీపీ నేతలు, ఏపీలో జరుగుతున్న హత్య రాజకీయాలను హైకోర్టు, సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తాం అన్నారు.