Sunday, May 4, 2025
- Advertisement -

రెడ్ బుక్‌ పేరుతో కక్ష తీర్చుకుంటున్నారు!

- Advertisement -

ఏపీలో రెడ్ బుక్‌ పేరుతో ప్రతిపక్ష వైసీపీ, అధికారులపై కక్ష తీర్చుకుంటున్నారని మండిపడ్డారు వైఎస్ జగన్. కూటమి ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులో అరెస్టయిన మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పరామర్శించేందుకు గుంటూరు సబ్ జైలుకి వెళ్లారు జగన్. వైసీపీ అధినేత జగన్‌కు మద్దతుగా గుంటూరుకు భారీగా తరలివచ్చారు వైసీపీ కార్యకర్తలు, అభిమానులు.

అనంతరం మాట్లాడిన జగన్..రెడ్ బుక్ రాసుకోవడం పెద్ద ఘనకార్యమా? అని ప్రశ్నించారు. రెడ్ బుక్‌లో పేర్లు రాసుకొని కక్ష తీర్చుకుంటున్నారు. ఎల్లకాలం మీ ప్రభుత్వం ఉండదు గుర్తుంచుకోవాలన్నారు. మీరు చేసే తప్పులే మిమ్మల్ని జైల్లో పెడతాయి… చంద్రబాబు పరిపాలన గాలికి వదిలేశారు.. తుఫాను వస్తుందని ముందే తెలిసినా చర్యలు తీసుకోలేదు అని దుయ్యబట్టారు.

నాలుగేళ్ల క్రితం టీడీపీ నాయకుడు పట్టాభి నా గురించి అసభ్యంగా మాట్లాడాడన్నారు. నాటి వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు జరిగాయి.. కొంతమంది టీడీపీ ఆఫీసు దగ్గర ధర్నా చేశారు అన్నారు. టీడీపీ వాళ్లే మా పార్టీ కార్యకర్తలపై దాడులు చేసి.. మాపై కేసులు పెట్టారు అని తెలిపారు జగన్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -