వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్తామంటే.. అడ్డుకునే మనస్తత్వం ఉన్న వారిని నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదు అని మండిపడ్డారు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్. మీడియాతో మాట్లాడిన జగన్..రాష్ట్రంలో ఇప్పుడు రాక్షస రాజ్యం నడుస్తోందన్నారు. డిక్లరేషన్ గురించి గగ్గోలు పెడుతున్న పచ్చమందకి చెంపపెట్టు లాంటి సమాధానమిచ్చారు. అబద్ధాలతో భక్తుల మనసులో అనుమానపు బీజాలు వేయడం దుర్మార్గం కాదా? అని ప్రశ్నించారు.
రాజకీయ స్వార్థం కోసం లడ్డూ ప్రతిష్టను దిగజార్చడం ధర్మమేనా అని ప్రశ్నించారు. అబద్ధాలతో తిరుమల ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు అన్నారు. రాజకీయ లబ్ధి కోసం 2 నెలల తర్వాత యానిమల్ ఫ్యాట్ కలిసిందని చంద్రబాబు చెప్తున్నాడు..కల్తీ నెయ్యి ప్రసాదాలకు వాడలేదని స్వయంగా టీటీడీ ఈవోనే చెప్తున్నాడు అన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఐదేళ్లు శ్రీవారికి అత్యంత భక్తి శ్రద్ధలతో పట్టువస్త్రాలను సమర్పించాను కానీ ఈరోజు నా మతం గురించి కొందరు అడుగుతున్నారు అని ప్రశ్నించారు.
100 రోజుల పాలనను డైవర్ట్ చేసేందుకు లడ్డూ అంశం తెరపైకి తెచ్చారు… లడ్డూ అంశంలోనూ చంద్రబాబు దొరికిపోవడంతో ఇప్పుడు డిక్లరేషన్ అంశాన్ని తెరపైకి తెస్తున్నాడు. ఓవైపు నన్ను, మరోవైపు వైసీపీ శ్రేణులను తిరుమలకు వెళ్లనివ్వడం లేదు అని ఆరోపించారు జగన్. చుట్టు ప్రక్కల రాష్ట్రాల నుంచి కూడా బీజేపీ వాళ్లను తిరుమల తెప్పిస్తున్నారు. టాపిక్ డైవర్ట్ చేయడం కోసం ఎందుకింత ప్రయత్నం చేస్తున్నారు..అడ్డగోలుగా చంద్రబాబు ఆలయ పవిత్రతను దెబ్బతీశారు. ఇప్పుడు డిక్లరేషన్ పేరుతో చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు అని దుయ్యబట్టారు.
తిరుమల విశిష్టతను, ప్రసాదం పవిత్రతను రాజకీయ దురుద్దేశంతో దెబ్బతీస్తున్నారు. జరగని విషయాన్ని జరిగినట్టుగా కల్తీ నెయ్యి అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఓ ముఖ్యమంత్రే సాక్షాత్తూ తిరుమలను దగ్గరుండి అపవిత్రం చేస్తున్నారు. నెయ్యి కొనుగోలు చేసే కార్యక్రమం ప్రతి 6 నెలలకోసారి రోటీన్‌గా జరిగే కార్యక్రమం అన్నారు.