Saturday, May 3, 2025
- Advertisement -

విజన్-2047..పబ్లిసిటీ స్టంట్!

- Advertisement -

ఏపీ సీఎం చంద్రబాబు విజన్ 2047 పేరుతో పబ్లిసిటీ స్టంట్ చేస్తున్నారని మండిపడ్డారు మాజీ సీఎం జగన్. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన జగన్…తన పరిపాలనలో మొత్తం 3 విజన్లు ప్రకటించిన చంద్రబాబు చిరస్థాయిగా నిలిచిపోయే పని ఒక్కటైనా చేశారా ప్రశ్నించారు.ప్రైవేటీక‌ర‌ణ పేరుతో ప్రభుత్వ విలువైన ఆస్తులను పప్పుబెల్లాల మాదిరిగా తన మనుషులకు కట్టబెట్టి అవినీతికి పాల్పడ్డారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజలను మభ్యపెట్టడానికి, మాయచేడానికి ఇదొక ఎత్తుగడ మాత్రమే…. చంద్రబాబు పత్రంలో రాష్ట్రం అవసరాలకు, ప్రజల అవసరాలకు చోటేలేదు, వాస్తవిక దృక్పథం అంతకన్నా లేదు అన్నారు. రైతుల ఆత్మహత్యలు, పనులకోసం వలసలు, ఉపాధిలేక, ఉద్యోగాల్లేక అష్టకష్టాలు, వీటన్నింటినీ దాచేసి చంద్రబాబు తన విజన్‌ చుట్టూ నడిపించిన ప్రచారం అంతా ఇంతా కాదు అన్నారు. 2014లోకూడా చంద్రబాబు విజన్‌-2029 డాక్యుమెంట్‌ ప్రచార ఆర్భాటంగానే మిగిలిపోయిందని దుయ్యబట్టారు.

ఎన్నికల్లో తానిచ్చిన మేనిఫెస్టోలో సూపర్‌సిక్స్‌ సహా ఇతర హామీలకు తూట్లు పొడుస్తూ మోసాలు, అబద్ధాలతో ప్రజలకు నమ్మక ద్రోహం చేస్తున్న చంద్రబాబు ఇప్పుడు మళ్లీ విజన్‌-2047 పేరిట డాక్యుమెంట్‌ విడుదల చేయడం మరో డ్రామా, స్టంట్‌ కాదా? చెప్పాలన్నారు. సహజంగా ఏ రాష్ట్రంలోనైనా కాలం గడుస్తున్న కొద్దీ ఆర్థిక వ్యవస్థ పెరుగుతూ వస్తుంది. ఇప్పటినుంచి వచ్చే 10ఏళ్లు తీసుకున్నా లేక గతంలో 10 ఏళ్ల లెక్కలు తీసుకున్నా ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా ద్రవ్యోల్బణం వల్ల, సహజంగా వచ్చే పెరుగుదల వల్ల వృద్ధిచెందుతూ ఉంటుంది. కానీ సంపద సృష్టి ఎప్పుడూ చేయని బాబు, ఎప్పుడూ ప్రభుత్వ ఆస్తులను అమ్మేసి సంపద ఆవిరిచేసే ఈ బాబు , ఆ పెరుగుదల తన వల్లే అని చెప్పుకుంటూ ఉంటారు. అందుకే ఈ మోసగాడిని మాత్రమే 420 అంటారు అన్నారు.

వైసీపీ ప్రభుత్వంలో అమలు చేసిన ఈ పథకాలు, కార్యక్రమాలను చంద్రబాబు నీరుగారుస్తున్నారు, రద్దుచేస్తున్నారు… విద్య, వ్యవసాయం, ఆరోగ్యం, ఉపాధి కల్పన, సుపరిపాలనలో తీసుకున్న విప్లవాత్మక సంస్కరణలు ఎన్నింటినో దెబ్బతీశారు అన్నారు. సమాజంలో కింద ఉన్నవారికి చేయూత నిచ్చి వారిలో జీవన ప్రమాణాలు పెంచి పేదరికాన్ని నిర్మూలించే దిశగా అమలుచేసిన కార్యక్రమాలన్నింటినీ తీసివేసి, పేదలను మరింత పేదవాళ్లుగా చంద్రబాబు తయారు చేస్తున్నాడని దుయ్యబట్టారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -