Saturday, May 3, 2025
- Advertisement -

డైవర్షన్ కోసమే నా కుటుంబాన్ని లాగుతున్నారు : జగన్

- Advertisement -

డైవర్షన్ కోసమే తన కుటుంబాన్ని లాగుతున్నారని మండిపడ్డారు వైఎస్ జగన్. మీడియాతో మాట్లాడిన జగన్..మీ ఇళ్లలో ఇలాంటి గొడవలు జరగవా ? అని ప్రశ్నించారు. ప్రతి ఇంట్లో జరిగే విషయాలను తమ స్వార్థం కోసం పెద్దదిగా చేసి చూపిస్తున్నారు అన్నారు. వీటిపై దృష్టి మానుకొని ప్రజలకు జరుగుతున్న అన్యాయాలపై దృష్టి పెట్టాలన్నారు. టీడీపీ అక్రమాలు, అన్యాయాలు బయటపెడుతున్నామని మళ్లీ డైవర్షన్స్‌ మొదలుపెట్టారని చెప్పుకొచ్చారు. ఈసారి అమ్మ, చెల్లెలు ఫొటో పెట్టి రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజల కష్టాల్లో పాలు పంచుకోండి…. రాష్ట్రంలో ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి వాటిని అరికట్టేందుకు దృష్టిసారించండి అని హితవు పలికారు. డయేరియాతో​ ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. బాధితులకు ప్రభుత్వం సాయం అందిస్తుందా? లేదా? అని ప్రశ్నించారు.

డయేరియా బారినపడిన వారిని మెరుగైన చికిత్స కోసం వేరే ఆసుపత్రులకు ఎందుకు తరలించలేదు?. స్కూల్‌ బెంచ్‌లపై వైద్యం చేస్తారా? అని వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ హయాంలో గ్రామస్వరాజ్యం తీసుకొచ్చాం…. గ్రామాలను సస్యశ్యామలం చేశాం అన్నారు కానీ కూటమి ప్రభుత్వంలో పరిస్థితులు అధ్వాన్నంగా మారాయి అన్నారు. వైఎస్సార్‌సీపీ హయంలో గ్రామ సచివాలయం ద్వారా సేవలు అందించాం…. వివిధ శాఖలకు చెందిన సేవలు సత్వరమే అందించగలిగాం అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -