Saturday, May 3, 2025
- Advertisement -

అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ దూరం

- Advertisement -

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నా మాజీ సీఎం , వైసీపీ అధినేత జగన్. వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం లేదని, అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్యలపై గళం విప్పేందుకు తమ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఏపీలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుస్తోందని చెప్పారు.క్షేత్ర స్థాయిలో ప్రభుత్వం మీద వ్యతిరేకత తీవ్రంగా ఉందని జగన్ అన్నారు. ప్రజలకు తోడుగా, ప్రజల్లో ఉంటే గెలుపు సాధించినట్టేనని చెప్పారు. ప్రజాసమస్యలపై పోరాటంలో వెనుకడుగు వేయొద్దని తెలిపారు.అసెంబ్లీలో వైసీపీ తప్ప వేరే ప్రతిపక్షం లేదని చెప్పారు. ప్రతిపక్ష పేదలకు వైసీపీ ఇచ్చిన ఇళ్ల స్థలాలు వెనక్కి తీసుకోవడం కుదరదని జగన్ చెప్పారు. ఎక్కడైనా అలాంటి సంఘటనలు జరిగితే ప్రజలకు అండగా ఉండాలని సూచించారు.

అసెంబ్లీకి వెళ్లినా, వెళ్లకున్నా ప్రజా సమస్యల పై పోరాటం చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. నేనింకా 30 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉంటాను. నాతో పాటు ఉండేవాళ్లు నా వాళ్లు అని తెలిపారు. 2028 ఫిబ్రవరిలో జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి అని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -