Saturday, May 3, 2025
- Advertisement -

ఇదేం రాజకీయం..ఒక్క కౌన్సిలర్‌ గెలవకుండానే!

- Advertisement -

ఏపీలో రాజకీయాలు చూస్తుంటే ప్రతి ఒక్కరూ అసహ్యించుకునే పరిస్థితి నెలకొంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కౌన్సిలర్లను బెదిరించి పార్టీ మారేలా ప్రోత్సహిస్తున్నారు. ఇలా రాష్ట్రంలో ఇప్పటికే పలువురు ఎమ్మెల్సీలు, రాజ్యసభ ఎంపీలు పార్టీలు మారగా పలు మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది టీడీపీ కూటమి. అయితే కొన్ని చోట్ల వైసీపీ నేతలు బెదిరింపులు, డబ్బు రాజకీయాలకు లొంగకపొవడంతో కూటమికి షాక్‌ తగిలే పరిస్థితి నెలకొంది.

ఇక ఇందులో జనసేన పార్టీ పరిస్థితి మరింత విచిత్రం. ఎందుకంటే ఒక్క కౌన్సిలర్ గెలవకుండానే మున్సిపల్ ఛైర్మన్ పదవిని కైవసం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి పరిణామం జరగడం ఇదే తొలిసారి.

తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మున్సిపాలిటీని జనసేన కైవసం చేసుకుంది. గత మున్సిపల్ ఎన్నికల్లో 28 స్థానాలకు గాను 27 స్థానాల్లో వైఎస్ఆర్ సీసీ కౌన్సిలర్లు విజయం సాధించారు. ఒక్క స్థానంలో టీడీపీ కౌన్సిలర్ గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన నేత కందుల ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కూడా అయ్యారు. ఈ నేపథ్యంలో పార్టీ ఫిరాయింపులను పెద్ద ఎత్తున ప్రోత్సహించారు. దీంతో 13 మంది వైసీపీ కౌన్సిలర్లు పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. ఒక టీడీపీ కౌన్సిలర్, మంత్రి దుర్గేష్ ఎక్స్ అఫిషియో ఓటుతో నిడదవోలు మున్సిపాలిటీని జనసేన కైవసం చేసుకుంది.

ఇలా జనసేన పార్టీకి ఒక్క కౌన్సిలర్ లేకపోయినా మున్సిపాలిటీని దక్కించుకోవడం విశేషం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -