Saturday, May 3, 2025
- Advertisement -

అక్రమ కేసులతో ఏం సాధించలేరు!

- Advertisement -

అక్రమ కేసులతో ఏం సాధించలేరని మండిపడ్డారు మాజీ మంత్రి జోగి రమేష్. సీఐడీ విచారణకు హాజరైన అనంతరం మీడియాతో మాట్లాడిన రమేష్..నాకు తెలిసిన పూర్తి సమాచారాన్ని అధికారులకు అందించాను… టీడీపీ నేత, ఇప్పటి స్పీకర్ అయ్యన్నపాత్రుడు గతంలో అసభ్యకరంగా జగన్‌ దూషించారు. ఆయన వ్యాఖ్యల పై చంద్రబాబు దగ్గరకు వెళ్లి నిరసన చేపట్టాం…. నిరసనకు వెళితే నాపై దాడి చేశారు. నా కార్లు ధ్వంసం చేశారు. నాపై అక్రమంగా కేసు పెట్టి ఏదో సాధించాలనుకుంటున్నారు.

ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కు మాకు లేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బాబు కుర్చీ కోసం సొంత పుత్రుడు.. దత్తపుత్రుడు పోటీపడుతున్నారని ఎద్దేవా చేశారు. విద్యార్ధి దశ నుంచే తాను రాజకీయాల్లో ఉన్నాను అని తెలిపారు.

ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే 75 మందికి డిపాజిట్లు గల్లంతైపోతాయని… కడుపునిండా అన్నం పెట్టిన జగనన్నను వదులుకుని పలావు పెడతానని చెప్పిన చంద్రబాబును నమ్మి ఓటేసినందుకు జనం బాధపడుతున్నారు అన్నారు. బాబు కుర్చీ కోసం సొంత పుత్రుడు.. దత్తపుత్రుడు పోటీపడుతున్నారు అన్నారు. మూడేళ్ల క్రితం ఘటనపై కేసుపెట్టి వేధించాలని చూస్తున్నారు….జగన్ ను చూసి ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -