Sunday, May 4, 2025
- Advertisement -

భారీ వర్షం..ఎన్టీఆర్, తీన్మార్ మల్లన్న విరాళం

- Advertisement -

తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. వరదల దాటికి హైదరాబాద్, విజయవాడ జలమయం కాగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వరద బాధితులను ఆదుకునేందుకు పలువురు ముందుకొచ్చారు.

వరద బాధితుల కోసం కోటి రూపాయలు విరాళం ప్రకటించారు జూనియర్ ఎన్టీఆర్. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద భీభత్సం నన్ను ఎంతగానో కలచివేసిందన్నారు. అతిత్వరగా ఈ విపత్తు నుండి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను అని చెప్పారు.

వరద విపత్తు నుండి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకొనే చర్యలకి సహాయపడాలని నా వంతుగా ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరొక 50 lakhs విరాళం గా ప్రకటిస్తున్నాను అని ఎక్స్ ద్వారా వెల్లడించారు.

ఏపీ, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్స్‌కి నటుడు విశ్వక్షేన్ రూ.10 లక్షల విరాళం అందించారు. చిన్న సాయమే అయినా వరద బాధితులకు కొంతమేరకైనా ఉపయోగపడుతుందని విశ్వక్‌సేన్ తెలిపారు.

ఖమ్మం వరద ముంపు బాధితులకు నెల జీతం విరాళంగా అందజేశారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. వరద బాధితుల కోసం రూ.100 కోట్ల విరాళం ప్రకటించారు తెలంగాణ ఉద్యోగులు. వ‌ర‌ద బాధితుల‌కు స‌హాయంగా ఉద్యోగుల ఒక రోజు వేత‌నం(రూ.100 కోట్లు) విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ వి.ల‌చ్చిరెడ్డి.

విశాఖ వరద బాధితులకు సింహచలం పులిహోర ప్రసాదం అందజేసేందుకు ఏర్పాట్లు చేశారు. విజయవాడకు 20 వేల పులిహోర ప్యాకెట్లు పంపేందుకు ఏర్పాట్లు చేయగా ఇప్పటికే రైలులో 10 వేల ప్యాకెట్లు పంపారు ఆలయ అధికారులు. మధ్యాహ్నం మరో 10 వేల పులిహోర ప్యాకెట్లు పంపేందుకు సన్నాహాలు చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -