Sunday, May 4, 2025
- Advertisement -

కాకాణి వర్సెస్ సోమిరెడ్డి..

- Advertisement -

టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీరును తీవ్రంగా తప్పుబట్టారు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేన కాకాణి గోవర్థన్ రెడ్డి. వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఇంకా బయట తిరుగుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోందని సోమిరెడ్డి మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నెల్లూరులో మీడియాతో మాట్లాడిన కాకాణి…సోమిరెడ్డి లాంటి వ్యక్తి.. విజయ సాయిరెడ్డికి సర్టిఫికెట్‌ ఇవ్వాల్సిన పనిలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విజయ సాయిరెడ్డి వ్యక్తిత్వం గురించి మాట్లాడే స్థాయి సోమిరెడ్డికి లేదు. నెల్లూరులో పట్టించుకోలేదని.. అసెంబ్లీకి వెళ్లి ప్రెస్ మీట్ పెట్టిన వ్యక్తి సోమిరెడ్డి. హిందీ, ఇంగ్లీష్ వచ్చుంటే ఢిల్లీకి వెళ్లి ప్రెస్ మీట్ పెట్టేవాడేమో?నని ఎద్దేవా చేశారు.

సోమిరెడ్డి గురించి అందరికీ తెలుసు అని…. ఎన్నికల సమయంలో అరబిందో కంపెనీకి సోమిరెడ్డి ఫోన్ చేసి రూ. 5 కోట్లు డబ్బులు అడిగిన మాట వాస్తవం కాదా? చెప్పాలన్నారు. అరబిందో కంపెనీ దగ్గర డబ్బులు తీసుకోలేదని కాణిపాకంలో సోమిరెడ్డి ప్రమాణం చేయగలడా? చెప్పాలన్నారు. పొదలకూరులోని లే అవుట్స్ మీద విచారణ ఎందుకు ఆపేశావ్‌?. సోమిరెడ్డి కొడుక్కి డబ్బులు ముట్టాయ్ కాబట్టే.. విచారణ ఆగిపోయిందని గుర్తు చేశారు కాకాణి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -