కేవీ రావుపై పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు మరిచిపోయారా? అని ప్రశ్నించారు మాజీ మంత్రి కన్నబాబు. 2019లో పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్ట్ నుంచి బియ్యం అక్రమ రవాణాపై ఏం మాట్లాడారో మరిచిపోయారా?… కేవీ రావు అనే వ్యక్తి వచ్చిన తరువాతే కాకినాడ పోర్ట్ నుంచి అక్రమ బియ్యం రవాణా పెరిగిపోయిందని ఆనాడు పవన్ ఆరోపించారు అని గుర్తుచేశారు కన్నబాబు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో ఉండటం వల్ల అరబిందో వాటాలు తీసుకున్న తరువాత అంటూ మాట మారుస్తున్నాడు అని దుయ్యబట్టారు.
పాలనలో తన వైఫల్యాలను, బలహీనతలను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు తప్పుడు రాజకీయాలు చేస్తున్నారన్నారు. తన మీడియా సంస్థల అండగా దుష్ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోజుల్లో కాకినాడ ఎస్‌ఈజెడ్ రైతులను చంద్రబాబు కాటువేశారు…రైతుల కన్నీళ్లను తీరుస్తూ జగన్‌గారు సాహసోపేత చర్యలు తీసుకున్నారు అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తిరిగి రైతులకు అప్పిగించారు…రైతులకు ఇచ్చి, వారిని సంతోపెడితే దాన్ని నేరంగా చూపిస్తున్నారు అన్నారు.
కట్టుకథలకు, పెట్టుబడులకు పుట్టిన విష పుత్రికలతో వక్రీకరణలు చేశారన్నారు. సుప్రీంకోర్టులో నమోదైన పలు కేసుల్లోనూ జగన్ సర్కార్ నిర్ణయం ఆదర్శప్రాయం అని కొనియాడారు… ఎస్ఇజెడ్ కు అప్పటికే భూములు ఇచ్చిన వారికి ఎకరానికి పదిలక్షలు పరిహారం ఇప్పించారు అన్నారు. గ్రామాలను ఖాళీ చేయాల్సిన అవసరం లేకుండా కాపాడారు… 2014లో అధికారంలోకి రాగానే గతంలో రైతులకు ఇచ్చిన హామీలను మరిచిపోయారన్నారు చంద్రబాబు.
రైతులను అరెస్టుచేసి చంద్రబాబు జైళ్లకు పంపారు…వారితో మరుగుదొడ్లు కడిగించారు అన్నారు. చంద్రబాబు రైతులపై చేసిన దాష్టీకాలను ఎవ్వరూ మరిచిపోలేరు…రైతుల భూములు వెనక్కి ఇస్తామని వైయస్ జగన్ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. 6 గ్రామాలను తరలించాల్సిన అవసరం లేదని సిఫార్స్ చేశారు. భూసేకరణలో తీసుకున్న శ్మశాన భూములను తిరిగి ఇప్పించాలని నిర్ణయం తీసుకున్నారని… రైతు ఉద్యమకారులపై చంద్రబాబు పెట్టిన కేసులను ఎత్తివేశారు. రైతులు కోరుతున్న 2180 ఎకరాలను వెనక్కి ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుందని…కోస గ్రామ పరిధిలో అసైన్ట్ భూములకు రూ.10 లక్షల పరిహారంకు సిఫార్సు చేశారు.
కాకినాడ సీ పోర్ట్ లో రెండు కంపెనీల మధ్య వాటాల కొనుగోలును చంద్రబాబు ప్రభుత్వం రాజకీయం చేస్తోంది. ఈ రాష్ట్రంలో ఇలాంటి లావేదేవీలు ఎప్పుడూ జరగలేదా? కేవీ రావును బెదరించి వాటాలు తీసుకున్నారని ఆరోపిస్తున్నారు.