Saturday, May 3, 2025
- Advertisement -

సనాతన ధర్మం అంటే కాషాయ బట్టలు వేసుకోవడమా?

- Advertisement -

సనాతన ధర్మం అంటే కాషాయ బట్టలు వేసుకోవడమా? చెప్పాలన్నారు మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. సాటివారిని, వేదాలను, గోవులను హింసిస్తే భగవంతుడు దుష్ట శిక్షణ చేసి, శిష్ట రక్షణ చేస్తాడు. టీటీడీకి చెందిన గోశాలలో గోవులు మరణించాయని చెబితే బాధ్యత కలిగిన పాలక పక్షం ఇటువంటి ఘటనలు జరగకుండా చూడాలి. కానీ ఈ ప్రభుత్వం ఎదురుదాడి చేస్తోంది అని మండిపడ్డారు.

సీఎం చంద్రబాబు, నారా లోకేష్, టీటీడీ అధికారులు గోవుల మృతిపై భిన్న వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు. సనాతన ధర్మం అనే పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నిస్తున్నాం… సనాతనధర్మం అంటే కాషాయి బట్టలు వేసుకోవడం మాత్రమే కాదు..ధర్మో రక్షతి రక్షితః అంటారు. మీ పాలనలో ఎక్కడ చూసినా బూతులు విమర్శలు, ఎదురుదాడులేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గిట్టుబాటు ధరలేక రైతులు అల్లాడిపోతున్నారు…. చంద్రబాబు నాయుడు ప్రతి రైతుకు రూ. 20 వేలు ఇస్తానని ప్రకటించాడు ఇవ్వలేదు. ఫీజు రీయింబర్స్మెంట్, అమ్మ ఒడి, ఫ్రీ బస్‌ ఏదీ లేదు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా మేము ప్రజా పక్షానే మాట్లాడతాం అన్నారు. పవిత్రమైన తిరుమలలో గోమాతల అంశంపై విచారణ జరపాలని ప్రభుత్వాన్ని మేం డిమాండ్ చేస్తున్నాం అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -