Saturday, May 3, 2025
- Advertisement -

వరంగల్ సభను విజయవంతం చేస్తాం!

- Advertisement -

బీఆర్ఎస్ వరంగల్ సభను విజయవంతం చేస్తామని తెలిపారు ఆ పార్టీ వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు. బి ఆర్ ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 వసంతాల సందర్భంలో జరుపుకుంటున్న రజతోత్సవ మహా సభ నిర్వహణ బాధ్యతలను తమ జిల్లాకు అప్పగించినందుకు వరంగల్ జిల్లా పార్టీ అధినేత కేసీఆర్ కి ధన్యవాదాలు తెలిపింది. ఈ నెల 27న జరిగే బిఆర్ఎస్ రజతోత్సవ మహాసభ కు సంబందించి, వరంగల్ జిల్లా ముఖ్య నాయకులంతా కలిసివచ్చి ఎర్రవెల్లి నివాసంలో పార్టీ అధినేత కేసీఆర్ గారి తో సమావేశమయ్యారు. సభా నిర్వహణకు సంబంధించి అధినేత నుంచి పలు సలహాలు సూచనలు తీసుకున్నారు.

ఈ సందర్బంగా వరంగల్ నేతలు మాట్లాడుతూ..అధినేత ఆదేశాలతో ఉద్యమసమయంలో కూడా అనేక భారీ సభలను సమర్థవంతంగా నిర్వహించి విజయవంతం చేసినామని అన్నారు. వరంగల్ లో సభా నిర్వహణ పార్టీకి కలిసొచ్చే అంశమని తమ ఆనందం వ్యక్తం చేశారు.రజతోత్సవ మహా సభ నిర్వహణ కోసం ఇప్పటికే వరంగల్ సమీపంలోని ఎల్కతుర్తి వద్ద 1213 ఎకరాల స్థలాన్ని మహా సభకు అనువుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.

ఇందులో 154 ఎకరాలు మహా సభ ప్రాంగణం వుంటుందన్నారు. పార్కింగ్ కోసం 1059 ఎకరాలు కేటాయించినట్లు తెలిపారు ఇందులో దాదాపు 50,000 వాహనాలు పార్కింగ్ చేసుకునే వీలుంటుంది అన్నారు. పార్టీ ఆవిర్భవించి ఇరవై అయిదు ఏళ్ల రజతోత్సవ సందర్భం కావడం తో కనీ వినీ ఎరుగని రీతిలో మహసభను నిర్వహించనున్నట్టు వరంగల్ జిల్లా నేతలు తెలిపారు.

రాష్ట్రం నలు మూలల నుండి పార్టీ కార్యకర్తలు కేసీఆర్ అభిమానులు తెలంగాణ వాదులు ప్రజలు భారీ ఎత్తున తరలివస్తారని తెలిపారు. సభకు తరలివచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్నిరకాల చర్యలు చేపట్టినట్టు తెలిపారు.రజతోత్సవ మహాసభకు తరలివచ్చే ప్రజల కోసం 10లక్షల మజ్జిగ ప్యాకెట్లను, 10 లక్షల నీళ్ల బాటిలను సిద్ధంగా వుంచనున్నట్టు తెలిపారు. ట్రాఫిక్ తదితర ఏర్పాట్లకు ఎటువంటి ఆటంకం కలగకుండా 1500 మంది వాలంటీర్లను నియమించనున్నారు. అత్యవసర వైద్య సేవలను, అంబులెన్స్లు అందుబాటులో ఉంచాను అన్నారు

నాటి ఉద్యమ రథసారథి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ స్వరాష్ట కోసం సాగిన శాంతియుత పోరాటంలో అనేక సభలను నిర్వహించుకున్న ఘనత వరంగల్ గడ్డకు ఉన్నదని జిల్లా నేతలు తెలిపారు. ఆనాటి ఉద్యమ సమయంలో నిర్వహించిన విశ్వరూప మహాసభ విజయవంతమైన స్ఫూర్తితో రజతోత్సవ మహాసభను విజయవంతం చేసుకుంటామని వరంగల్ జిల్లా నేతలు ధీమా వ్యక్తం చేశారు. వరంగల్ గడ్డ ముద్దుబిడ్డలు మహాకవి కాళోజీ నారాయణరావు, తెలంగాణ భావజాల వ్యాప్తి కోసం తన జీవితాన్ని అర్పించిన ప్రొఫెసర్ జయశంకర్ సార్లు అందించిన ఉద్యమ స్ఫూర్తితో తిరిగి పార్టీ పార్టీ కోసం ప్రజల కోసం తమ కార్యాచరణను అమలు చేస్తామన్నారు.

రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి అధినేతకు బహుమతిగా అందజేస్తామని వరంగల్ జిల్లా పార్టీ ముక్త కంఠంతో ప్రకటించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -