Thursday, April 25, 2024
- Advertisement -

అవి ఎప్పుడు పోవాలి.. అది ఎప్పుడు కట్టాలి.. ఇప్పటిలో కష్టమే….?

- Advertisement -

తెలంగాణ లో సచివాలయ కూల్చివేత ఎప్పుడైతే మొదలుపెట్టారో అప్పటినుంచి కేసీఆర్ కి కొంత గడ్డుకాలం ఎదురవుతుందని చెప్పొచ్చు.. ప్రతిపక్షాలు అన్ని ఒక్కసారి గా మీద పడిపోవడంతో సగంలో కూల్చివేత పనులు ఆపేసి కోర్టు పర్మిషన్ తెచ్చుకున్న వైనం మనం చూశాం.. అందులో గుప్తా నిధులు ఉన్నాయని అండగంతో దానికోసమే కేసీఆర్ కూల్చివేస్తున్నాడని ఆరోపణలు రావడం ఆయనకు పెద్ద మైనస్ అయ్యాయి.. ప్రజల్లో సైతం కేసీఆర్ పై చాల అనుమానాలకు దారి తీసింది ఈ ఇష్యూ..

ఇక కోర్టు నుంచి పర్మిషన్ వచ్చాకా సచివాలయం కూల్చివేత పనులు ముమ్మరంగా జరిగాయి. కాగా ఇప్పుడు ఓ కొత్తరకం వాదన వెలుగులోకి వస్తుంది.. అదే సచివాలయం కూల్చివేత తో మిగిలిపోయిన వ్యర్థాలు.. సచివాలయ కూల్చివేత కార్యక్రమాన్ని మొదలు పెట్టి దాదాపు నెలకు పైనే కావొస్తున్నా.. ఇప్పటివరకు వాటి వ్యర్థాల తరలింపే పూర్తి కాకపోవటం గమనార్హం.దాంతో కేసీఆర్ మరోసారి విమర్శలకు గురవుతున్నారు..

అయితే గుట్టలుగుట్టలుగా సచివాలయం వ్యర్థాలు అలా ఉండడంతో చేతిలో ఉన్న భవనాన్ని కూల్చేసి కొత్తది కడుతున్నారు.. ఇంకా ఈ వ్యర్థాల తొలగింపే పూర్తి కాలేదు ఎప్పుడు కొత్త భవనాలు నిర్మిస్తారు అని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇక ఈ వ్యర్థాలను తరలించేందుకు అవసరమైన వాహనాల సంఖ్య చూస్తే చాలా తక్కువ అని తెలుస్తుంది. దగ్గర దగ్గర లక్ష టన్నులుగా ఉండొచ్చని చెబుతున్నారు. వీటిని తరలించాలంటే కనీసం 60వేల ట్రక్కులు అవసరముతాయని అంచనా వేశారు. నగర చరిత్రలో ఒకేచోట నుంచి లక్ష టన్నుల నిర్మాణ వ్యర్థాలు రావటం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. గడిచిన నెల రోజులుగా రోజుకు వంద ట్రక్కులతో రీసైక్లింగ్ యూనిట్లకు తరలిస్తున్నా.. ఈ వ్యర్థాల కొండ మాత్రం తగ్గట్లేదని చెబుతున్నారు.ఈ నేపథ్యంలో కేసీఆర్ ఈ వ్యర్థాల తొలగింపునకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -