- Advertisement -
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు మాజీ మంత్రి కొడాలి నాని. ఇవే తనకు చివరి ఎన్నికలని 2029లో పోటీ చేయనని ప్రకటించారు. ఇక ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయనపై వరుస కేసులు నమోదవుతున్నాయి.
ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్‌తో సమావేశమయ్యారు నాని. రాజకీయాలకు నాని దూరం కానున్నారని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఈభేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. తాజా రాజకీయ పరిణామాలపై వీరిద్దరి మధ్య చర్చ జరుగగా ప్రస్తుతం పార్టీకి అండగా ఉండాల్సిన అవసరం ఉందని జగన్ సూచించారు.
టీడీపీ దాడులు పెరిగిపోతున్న తరుణంలో కార్యకర్తలకు భరోసా ఇవ్వాలని…తాను కూడా జిల్లాల పర్యటనకు వెళ్తానని చెప్పారు. జగన్‌తో భేటీ తర్వాత మనసు మార్చుకున్న నాని… జిల్లాలో కార్యకర్తలను పరామర్శించేందుకు వెళ్తానని చెప్పారు. దీంతో కేడర్‌లో జోష్ నెలకొంది.