కోల్‌కతా డాక్టర్ హత్యాచారం కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కోల్‌కతాలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక ఈ కేసును సుమోటోగా స్వీకరించిన దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇవాళ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా బెంగాల్ ప్రభుత్వ తీరును తప్పుబడుతూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆసుపత్రిని ధ్వంసం చేస్తున్నప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అంత ఘోరం జరిగితే ఆత్మహత్య అని ఎలా చెప్పారని.. ఎఫ్ఆర్ఐ నమోదు ఎందుకు ఆలస్యమైందని ప్రశ్నించింది. . శాంతియుత నిరసనకారులపై అధికారం చెలాయించొద్దని …ఇది దేశమంతా ఆందోళన వ్యక్తం చేస్తున్న అంశం అని మండిపడ్డారు. వైద్యులు, పౌరసమాజాన్ని అడ్డుకోవడం సరికాదని మమతా ప్రభుత్వాన్ని మందలించింది.
ప్రిన్పిపాల్ రాజీనామా చేసినా వేరే కాలేజీకి ఎందుకు నియమించారని…విద్యార్థిని తల్లిదండ్రులను 3గంటల పాటు ఎందుకు వెయిట్ చేయించారు అని ప్రశ్నల వర్షం కురిపించింది. అత్యాచారం, హత్యను బలవన్మరణంగా ఎందుకు చిత్రీకరించారు.. బాధితురాలి కుటుంబ సభ్యులు రాత్రి 8.30 గంటలకు ఆమె మృతదేహాన్ని స్వీకరించారు.. రాత్రి 11.45 గంటలకు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు. ఈ ఘటనపై ఆగస్టు 22వ తేదీలోగా నివేదిక సమర్పించాలని సీబీఐను సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 22వ తేదీకి వాయిదా వేసింది.