తెలంగాణ మంత్రి కొండా సురేఖ మరోసారి సంచలన కామెంట్ చేశారు. ఇప్పటికే నటి సమంతపై కొండా చేసిన కామెంట్స్ పెను దుమారాన్ని రేపగా మరోసారి కేటీఆర్ టార్గెట్‌గా రెచ్చిపోయారు సురేఖ. కేటీఆర్….కేసీఆర్ బొండిగ పిసికి చంపి పూడ్చిపెట్టిండేమో అని అనుమానం కలుగుతుందన్నారు. అసలే కేటీఆర్ కు పదవీ కాంక్ష ఎక్కువ అని మండిపడ్డారు.
మనం అందరం కూడా కేసీఆర్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని… బీఆర్ఎస్ అధికారం కోల్పోవడానికి కేటీఆరే కారణం అని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో కేటీఆర్…ఆయనే సీఎం అనుకొని పనికిమాలిన నిర్ణయాలు తీసుకున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిచిన మరుసటి రోజు నుంచే కేటీఆర్ ప్రభుత్వంపై విషప్రచారం చేస్తూ వస్తున్నాడని దుయ్యబట్టారు సురేఖ.
పదేళ్ళు అధికారాన్ని అనుభవించిన కేటీఆర్ కు ఇప్పుడు అధికారం చేజారడంతో ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియని పరిస్థితి నెలకొందన్నారు. మూసీ నిర్వాసితులను కేటీఆర్ ఎందుకు రెచ్చగొడుతున్నారు? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా కేటీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరిస్తున్నాను అని చెప్పగా కొండా తాజాగా చేసిన కామెంట్స్ మరోసారి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.