ఇది పర్సంటేజ్ ప్రభుత్వం…!

సుప్రీం కోర్టు తీర్పుతో కాళేశ్వరం విషయం తేలిపోయింది అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడిన కేటీఆర్… కాళేశ్వరం లో ఎన్నో కంపోనేంట్స్ ఉన్నాయ్ మూడు పిల్లర్లు కూలితే ఇంత రచ్చ నా చెప్పాలన్నారు. దున్నపోతు ఇనింది అంటే దుడ్డేను కట్టేయండి అన్నట్టు ఉంది బీజేపీ, కాంగ్రెస్ తీరు..ముఖ్య మంత్రి అందాల బామల చుట్టు తిరుగుతున్నాడు అన్నారు.

Slbc ప్రాజెక్ట్ కూలి 8 మంది చిక్కుకుని చనిపోతే బయటకు తీయలేని అసమర్ధుడు రేవంత్ అని దుయ్యబట్టారు. ప్రభుత్వం అసమర్ధత ను కప్పిపుచ్చుకునేందుకు నోటీసు ల పేరుతో డ్రామాలు ఆడుతున్నారు… ముఖ్యమంత్రి అపరిచితుడు ల ప్రవర్తిస్తున్నాడు అన్నారు. రాము రెమో లాగా ఒక్కోరోజు ఒక్కోలా మాట్లాడుతాడు…
ఒకరోజు దేశం లో ఎవడు నమ్మటం లేదు అంటూ ఇంకో రోజు లక్ష 20 వేల కోట్లు అప్పు తెచ్చా అని గొప్పలు చెప్తాడు అన్నారు.

కెసిఆర్ అనావలు లేకుండా చేస్తానంటాడు మళ్ళీ కెసిఆర్ అనావల్లానే ప్రపంచానికి చూపిస్తాడు… రేవంత్ కి (ఎంపీడి) మల్టిపుల్ పర్సనల్ డిసార్డర్ అనే వ్యాధి ఉంది అని ఎద్దేవా చేశారు. 16 నెలలుగా నోటీసులు ఇవ్వడం తప్ప రాష్ట్రనికి చేసింది ఏమి లేదు…60 నెలలు టైమ్ పాస్ చేసేందుకు రోజుకో డ్రామా కి రేవంత్ తేర లేపుతున్నడు అన్నారు. ఉన్న డిక్లరేషన్ అమలుచేసే దిక్కు లేదు కాని నల్లమల డిక్లరేషన్ అంటున్నాడు …మంత్రులు మిస్ వరల్డ్ కాంటెస్టెంట్స్ కి టూర్ గైడ్ ల ల వ్యవహరిస్తున్నారు అని దుయ్యబట్టారు. పాలమూరు విషయం లో ఏ విధంగా తీర్పు వచ్చిందో కాళేశ్వరం పై కూడా అలాంటి తీర్పే వస్తుంది … ఇది పర్సెంటేజ్ ప్రభుత్వం రేవంత్ ది డైవర్షన్ రాజకీయం అన్నారు.