Saturday, May 3, 2025
- Advertisement -

జగన్ ఓటమి ఆశ్చర్యమేసింది:కేటీఆర్

- Advertisement -

ఏపీలో జగన్ ఓటమి ఆశ్చర్యమేసిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఢిల్లీలో చిట్‌ చాట్‌గా మీడియాతో మాట్లాడిన కేటీఆర్..పేదలకు పెద్ద ఎత్తున పథకాలు ఇచ్చినా జగన్ ఓడిపోవడం ఆశ్చర్యం కలిగించిందని…అయినా 40 శాతం ఓట్లు సాధించడం మాములు విషయం కాదు అన్నారు.

పవన్ విడిగా పోటీ చేసి ఉంటే ఫలితాలు మరో విధంగా ఉండేవని…ప్రతిరోజూ జనంలోకి వెళ్ళే కేతిరెడ్డి ఓడిపోవడం బాధాకరమన్నారు. సంచులతో దొరికినవాడు సీఎం అయ్యాడని పరోక్షంగా రేవంత్‌ను ఉద్దేశించి కామెంట్ చేశారు. జగన్ ను ఓడించేందుకు షర్మిల ను ఒక వస్తువులా ఉపయోగించారని…అంతకు మించి షర్మిల ఏమీ లేదు అన్నారు.

ప్రజలతో మాకు గ్యాప్ వచ్చిందని…మా వైఖరి మార్చుకోవాలన్నారు. ప్రజలది తప్పు అనడమంటే..మాది తప్పు అవుతుందన్నారు. అభివృద్ధిని చెప్పుకోలేకపోయామని…అంతేగానీ తెలంగాణ పేరు మార్చడం వల్ల ఓడిపోయామనడానికి ఆధారం లేదు అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -