Saturday, May 3, 2025
- Advertisement -

ఆ రెండు పార్టీల వల్లే మురికి కూపంగా మూసీ!

- Advertisement -

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మూసీ పరివాహాక ప్రాంతంలో ఎలాంటి సర్వే జరగలేదు అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ పై సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడిన అంశాలను కౌంటర్ చేస్తూ పూర్తి వివరాలతో తెలంగాణ భవన్ లో కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సాగింది.

జేసీబీలతో ఇళ్లు కూలగొట్టారు. కూలీలతో ఇళ్లను కూలగొట్టించారు. ఆ విషయాన్ని ఓ కూలీయే చెప్పాడన్నారు. ప్రాజెక్ట్ కు సంబంధించి అంచనాను రూ. 50 వేల కోట్ల నుంచి రూ. లక్షా న్నర కోట్ల వరకు అన్ని పచ్చి అబద్దాలే అన్నారు. మూసీ బ్యూటీఫికేషన్ కాదు ఇది లూటీఫికేషన్ అని ప్రజలకు తెలియటంతో తప్పును కప్పి పుచ్చుకోవటానికి నానా ఇబ్బంది పడిపోతున్నాడన్నారు.

మూసీ పేరుతో లక్షాన్నర కోట్ల దోపిడీ చేసే ప్రయత్నాన్ని తెలంగాణ సమాజం అర్థం చేసుకుంటోందని…ముఖ్యమంత్రికి మూసీ మీద ప్రేమ అంత కూడా ఢిల్లీకి మూటలు పంపించేందుకే…బడేభాయ్ నోట్ల రద్దు పై రోజుకో కారణం చెప్పినట్టు…చోటే భాయ్ కూడా మూసీ పై రోజుకో కారణం చెబుతున్నాడు అన్నారు. అసంబద్ధంగా, ఆనాలోచితంగా తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం కారణంగా ఎంతటి అనర్థాలు జరిగాయో గుర్తు చేస్తున్నాను….మూసీ విషయంలోనూ ఇదే విధంగా ఆనాలోచితంగా, అసంబద్ధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు అన్నారు.

గోపనపల్లి లో రూ. లక్షాన్నర కోట్లతో మూసీ సుందరీకరణ చేస్తామని రేవంత్ రెడ్డియే అన్నారు…మళ్లీ గజిని మాదిరిగా రూ. లక్షన్నర కోట్లు అన్నది ఎవ్వరూ అని అంటున్నాడు అన్నారు. ఒక రోజు బ్యూటీఫికేషన్, ఒక రోజు క్లీనింగ్, ఒకరోజు పునరుజ్జీవనం, ఒక రోజు నల్గొండకు మంచి నీళ్లు అంటూ రోజుకో మాట మాట్లాడుతున్నారు….గతంలో మేము మూసీ ప్రక్షాళన కోసం చాలా పనులు చేపట్టాం అన్నారు.1908 లో అతి పెద్ద ఉప్పెన, వరద రావటంతో హైదరాబాద్ లో 15 వేల మంది చనిపోయారు….దీంతో అప్పటి నిజాం మీర్ ఉస్మాన్ అలీ హైదరాబాద్ ను వరదల నుంచి రక్షించేందుకు మోక్షగుండం విశ్వేశ్వరయ్య సలహా కోరారు అన్నారు. అప్పుడు ఆయన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ను నిర్మించాలని చెప్పారు….హైదరాబాద్ లో వరదల కారణంగా ఇబ్బంది తలెత్తకుండా సిటీకి రక్షణ కవచంలా ఈ రెండు జలాశయాలను నిర్మించారు అన్నారు.

ఆ తర్వాత మూసీ విషయంలో ఏ ప్రభుత్వం కూడా మళ్లీ అంత గొప్పగా పనిచేయలేదు…. హైదరాబాద్ లో ఉన్న నాలాలా ద్వారా 90 శాతానికి పైగా మురికి నీళ్లు, వాన నీళ్లు మూసీలోకే వస్తాయన్నారు. వరద నివారణకు, ప్రాణనష్టం లేకుండా ఉండేందుకు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రెండు రిజర్వాయర్లు చాలని మోక్షగుండం విశ్వేశ్వరయ్య తెలిపారు. 2015 లో సెంట్రల్ పొలుష్యన్ బోర్డు అతి పెద్ద కాలుష్యమైన నది మూసీ అని రిపోర్ట్ ఇచ్చిందన్నారు.

మూసీ రివర్ ను మురికి కూపంగా మార్చింది రేవంత్ రెడ్డి అన్నట్లు గత పాలకులే. వారిలో కాంగ్రెస్ సహా టీడీపీ ప్రభుత్వం ఉందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చే వరకు మూసీని బాగు చేసేందుకు ఏ ప్రభుత్వం కృషి చేయలేదు..కేసీఆర్ వచ్చాక పొలుష్యన్ బోర్డు రిపోర్ట్ తెప్పించుకొని మూసీని బాగుచేసేందుకు నిర్ణయం తీసుకున్నారు అన్నారు.

2017 లో కేసీఆర్ మొదటి సారి మూసీ రివర్ ఫ్రంట్ పేరుతో కార్పొరేషన్ ఏర్పాటు చేసి మూసీని బాగు చేయాలనుకున్నారు…మూసీని మేము బ్యూటిఫికేషన్ తో పాటు పునరుజ్జీవనం చేస్తూ నల్గొండకు మంచి నీళ్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అన్నారు.కానీ రేవంత్ రెడ్డి మూసీ పుట్టే వికారాబాద్ అడవుల్లోనే ఆ నదికి ఉరి వేసేలా రాడార్ నిర్మాణానికి అనుమతిచ్చారు..మూసీ పై ఈస్ట్ టూ వెస్ట్ ఎక్స్ ప్రెస్ హై 10 వేల కోట్ల రూపాయలతో కట్టాలని అర్బన్ మొబిలిటీ చేయాలని ఆలోచన చేశాం అన్నారు. ముఖ్యంగా పేదవాళ్లను నిరాశ్రయులను చేయవద్దని మేము ఆలోచన చేశాం…మొత్తంగా మేము మూసీ ప్రాజెక్ట్ ను కేవలం రూ. 16 వేల కోట్లతో చేయాలని నిర్ణయించాం అన్నారు.

దానిలో భాగంగా కొన్ని పనులు కూడా చేపట్టాం….నాగోల్, ఉప్పల్ భగాయత్ ప్రాంతంలో వాకింగ్ ట్రాక్స్ ను, పార్క్ లను ఏర్పాటు చేశాం అన్నారు. కాళేశ్వరం లో లక్ష కోట్ల అవినీతి అని ఏ కాంగ్రెస్ వాళ్లు మొత్తుకుంటారో…అదే కాళేశ్వరం నీళ్లను రూ. 11 వందల కోట్లతో గండిపేటలోకి కలపాలని నిర్ణయం తీసుకున్నాం….సౌత్ ఏషియాలోనే ఎక్కడ లేని విధంగా ఎస్టీపీలతో 100 శాతం మురుగు నీటి శుద్ది చేసే పని పెట్టుకున్నాం అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -