Saturday, May 3, 2025
- Advertisement -

కాంగ్రెస్ పార్టీ అంటేనే నయవంచన!

- Advertisement -

కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం, దగా, నయవంచన అని మరోసారి రుజువయ్యిందని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. రాజ్యంగం అమలులోకి వచ్చిన 75 ఏండ్ల సంబరాల సందర్భంగా.. దశాబ్దాలుగా కాంగ్రెస్ చేతిలో మోసపోతున్నది రైతన్నలే అనే సందేశాన్ని ఇస్తూ, ప్రభుత్వం 15 వేలు ఇస్తామని చెప్పి 12 వేలే అంటూ సవాలక్ష కండీషన్లు పెట్టి, జనవరి 26న రైతు భరోసా మోసానికి అధికారికంగా తెరలేపున్నది రేవంత్ ప్రభుత్వం అన్నారు.

ఎకరానికి 15 వేలు ఇస్తామని 12 వేలకు కుదించడం రైతులను నిలువునా వంచించడమే. తెలంగాణ రైతాంగం ఈ ద్రోహాన్ని క్షమించరు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.♦️ నమ్మి ఓటేసిన పాపానికి పచ్చి మోసానికి పాల్పడ్డ ఈ కాంగ్రెస్ ను రైతన్నలు పాతరేస్తారు… మోసం అనే పదం చిన్నదైపోతది. దగా, నయవంచన పదాలు కూడా సరిపోవు అన్నారు.

కాంగ్రెస్ రైతాంగానికి చేసిన ఈ ద్రోహం.. తెలంగాణ చరిత్రలో చీకటి అధ్యాయంగా మిగిలిపోతది… కపట నాటకాలకు, నోరు తెరిస్తే అబద్ధాలకు, బూటకపు వాగ్దానాలకు కేరాఫ్ కాంగ్రెస్/రేవంత్ అని రైతాంగానికి అర్థమైపోయిందన్నారు. తెలంగాణ చరిత్రలో రేవంత్ రైతుద్రోహిగా మిగిలిపోతాడు… డిక్లరేషన్ కాదు కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చే గ్యారెంటీ అని రాహుల్ గాంధీ అన్నారు. రైతు భరోసా 12 వేలకు కుదించి సంబరాలు చేయాలని కాంగ్రెస్ అంటోంది. ఎందుకు సంబరాలు చేయాలి రైతన్నలకు 15000 ఇస్తామని చెప్పి కోతలు పెట్టినందుకా? చెప్పాలన్నారు.

ఎన్నికల్లో ఓట్ల కోసం మాయమాటలు చెప్పి మోసం చేసినందుకు పాలాభిషేకాలు చేయాలా? ఎందుకని చేయాలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలి… కాంగ్రెస్ అబద్దాలకు డిక్షనరీలో కొత్త పదాలు కనిపెట్టాలి అన్నారు. రాహుల్ గాంధీకి తెలంగాణకు వచ్చే దమ్ము ఉందా?, రేవంత్ రైతాంగానికి తీరని ద్రోహం చేసినందుకు తెలంగాణ ప్రజాక్షేత్రంలో ముక్కు నేలకు రాయాలె అన్నారు. నమ్మించి నయవంచన చేసినందుకు రాహుల్ గాంధీ 70 లక్షల మంది రైతులకు క్షమాపణలు చెప్పాలె… మ్యానిఫెస్టోలో రైతులకిచ్చిన ప్రధాన హామీని నిలబెట్టుకోనందుకు ముఖ్యమంత్రి ముందుగా రాష్ట్ర రైతాంగం ముందు లెంపలేసుకోవాలన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని నాశనం చేసింది రేవంత్ రెడ్డినే, మూర్ఖంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వలన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అతలాకుతలమైందన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -