నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లపై ఈడీ ఛార్జ్‌షీట్ నమోదు చేస్తే, కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ఒక్క మాట కూడా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడడం లేదు అని మండిపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్.
చోటే భాయ్ రేవంత్ రెడ్డికి, బడే భాయ్ మోడీకి మధ్య ఉన్న దృఢమైన బంధమే ఇందుకు కారణం అన్నారు. హెచ్‌సీయూ ఘటనపై ప్రధానమంత్రి మోడీ స్వయంగా కామెంట్ చేసినా ఇంతవరకు చర్యలేవి అని ప్రశ్నించారు.
గ్రేటర్ హైదరాబాద్ నేతలు, కార్యకర్తలతో తెలంగాణ భవన్‌లో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ సన్నాహక సమావేశంలో పాల్గొన్న కేటీఆర్…జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తామన్నారు. కౌన్సిలర్లకు విప్ జారీ చేస్తామని, ధిక్కరించిన వారిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
రేవంత్ రెడ్డి పిచ్చి పనులతో కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో అసహ్యం పెరుగుతుందని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజలే బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తారని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లోని కాలనీలు, బస్తీల్లో పార్టీ జెండా ఎగురవేసి, 27న జరిగే ఆవిర్భావ సభ కోసం దండులా కదలాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. 27న జరిగే బీఆర్ఎస్ ఆవిర్భావ సభ తెలంగాణ ప్రజల ఇంటి పండుగ అని అన్నారు.