తెలంగాణ పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు మాజీ మంత్రి కేటీఆర్. హెచ్‌సీయూ భూములపై సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్పందించిన కేటీఆర్.. తెలంగాణ పోలీసులు రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలా పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇష్టమొచ్చినట్లు కేసులు పెడుతున్నారు..అలా కేసులు పెట్టిన వారి మీద కూడా సుప్రీంకోర్టుకు పోతాము, మీరు కూడా ఊచలు లెక్కపెట్టాల్సి వస్తుంది.. జాగ్రత్త అని హెచ్చరించారు. రిట్వీట్ చేసినా కేసులు పెడుతున్నారని దుయ్యబట్టారు.
కొత్త ప్రభాకర్‌రెడ్డి చెప్పింది అక్షరసత్యం… కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టమని అంటున్నారు, పైసలు కూడా ఇస్తామన్నారు కానీ ప్రభుత్వాన్ని కూలగొట్టే ఆలోచన మాకు లేదు అన్నారు. రేవంత్ రెడ్డి చేసిన 10 వేల కోట్ల HCU భూముల కుంభకోణంపై మోడీ ఎందుకు విచారణకు ఆదేశించడం లేదు చెప్పాలన్నారు.
HCU భూములపై రూ.10 వేల కోట్ల కుంభకోణం జరిగిందని వారం రోజుల కింద చెప్పా… నిన్న సీఈసీ HCU భూములపై ఆర్థిక పరమైన అవకతవకలు, ఉద్దేశపూర్వకంగా చేసిన అరాచక పర్వంపై స్పెషలైజ్డ్ ఏజెన్సీ ద్వారా ఇండిపెండెంట్ ఇన్విస్టిగేషన్ టీంను ఏర్పాటు చేయాలని నివేదిక ఇచ్చింది అన్నారు.
HCU కంచ గచ్చిబౌలి భూముల్లో చెరువును కూడా రేవంత్ రెడ్డి తాకట్టు పెట్టాడు.. రేవంత్ రెడ్డి లాంటి పిచ్చి సన్నాసి తప్ప చెరువును ఎవడు తాకట్టు పెట్టడు అని ఎద్దేవా చేశారు.