కాంగ్రెస్ పార్టీ సస్పెన్షన్ ఆర్డర్ అందింది.. కాంగ్రెస్ పార్టీ లో బానిసగా బతకలేను అన్నారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. మీడియాతో మాట్లాడిన మల్లన్న.. కులగణన విషయంలో బీసీలకు అన్యాయం జరిగితే బరాబర్ కొట్లాడుతం… రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకో బీసీ సత్తా చాటుతాం అన్నారు. గ్రామ గ్రామాన బీసీ వాదం తీసుకెళ్తాము… మీ మో చేతి నీళ్లు తాగే ప్రసక్తే లేదు రేవంత్ రెడ్డి అన్నారు. Ews కోటా ఉద్యోగాలు ఇచ్చారా బయటపెడుతా… కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాల్సిందేనన్నారు. కులగణన పై చర్చకు నేను సిద్దం ఎవరైన రండి..ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయను అని స్పష్టం చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో దేశంలో బీసీల ఉద్యమం ఇక్కడి నుంచే ప్రారంభం.. మల్లన్న ను సస్పెన్షన్ చేస్తే బీసీ ఉద్యమం ఆగదు అన్నారు. పాత బీసీలం కాదు… కులగణన తప్పు అని చెప్తే సస్పెండ్ చేస్తారా చెప్పాలన్నారు.బీసీల గురించి ఎంతవరకైనా పోరాడుతా.. గతంలో కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే పకడ్బందీగా చేశారు అన్నారు. కాంగ్రెస్ సర్వే తూతూ మంత్రంగా చేశారు.. కాంగ్రెస్ పార్టీ సర్వే ఆదర్శవంతగా లేదు, బీసీ సర్వే కాలపెట్టడం తప్పు ఉన్నందుకే కాలపెట్టిన అన్నారు. సర్వే తప్పు అయితే మళ్ళీ ఎందుకు సర్వే నిర్వహించారు.. సమగ్ర కుటుంబ సర్వే కు ఆర్హత లేదని ఎలా చెబుతారు చెప్పాలన్నారు.
కోటీ 15 లక్షల ఇళ్లు ఉంటే… బీసీలు ఎక్కడ పోయారు.. Ews ను రక్షించడం కోసమే కొత్త నాటకం అన్నారు. ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డికి నచ్చడం లేదు.. Ews కోట రద్దు చేయాలని ఎన్నో సార్లు వినతి చేశా… బీసీ వర్గాల హక్కుల కోసం పోరాడుతా అన్నారు. కాంగ్రెస్ సర్వేను ఎవ్వరు నమ్మలేదు.. మీది సర్వే నిజమైతే రేవంత్ రెడ్డి బాధ్యత వహిస్తారా.. రేవంత్ దీని పై చర్చకు సిద్ధమా..? అని ప్రశ్నించారు.
బీసీల ఉద్యమాలను అణచివేతకు కాంగ్రెస్ కుట్ర.. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాడానికి కారణం తీన్మార్ మల్లన్న.. Q న్యూస్ ఆఫీస్ మరో గాంధీ భవన్ అయింది అన్నారు. తీన్మార్ మల్లన్న పెట్టిన బీక్షే.. కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణలో రాబోయే రోజుల్లో బీసీ ముఖ్యమంత్రి కావడం ఖాయం… షోకాజ్ నోటీసకు సస్పెన్షలకు మల్లన్న భయపడడు అన్నారు. 2011 సర్వేలో 44 లక్షలు ముస్లీం జనాభా ఉంది.. ఈ సర్వేలో ముస్లింలు జనాభా పెరగలేదా..?, 42 శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తామంటే కాంగ్రెస్ పార్టీలో చేరానని తెలిపారు. స్వయంగా రాహూల్ గాంధీ గారే చెప్పారు..ముఖ్యమంత్రి గారు మీరు చేసింది తప్పు, రాజగోపాల్ రెడ్డి, వెంకట్ రెడ్డి లకు ఒక న్యాయం..బీసీలకు ఓ న్యాయమా చెప్పాలన్నారు.
రాహుల్ గాంధీకి ఆశయం కోసం పని చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలకు రుణపడి ఉంటా.. కార్పొరేషన్ ల పదవుల్లో బీసీలకు అన్యాయం జరిగిందన్నారు. అన్ని పార్టీ లో బీసీలకు అన్యాయం చేస్తే ప్రశ్నిస్తాము..తీన్మార్ మల్లన్నకు గెలుపుకు కారణం బీసీలు, రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో కాంగ్రెస్ ఓడిపోయింది.. బీజేపీకి రేవంత్ రెడ్డి పరోక్షంగా మద్దతు తెలుపుతున్నారు అన్నారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ బిడ్డలు గెలుస్తున్నారు… ఎమ్మెల్సీ ఎన్నికల కోసమే పిట్టలు దిరిగినట్లు తిరిగారు..
ఏడాది లొనే కాంగ్రెస్ పై ప్రజలకు నమ్మకం లేదు అన్నారు.