Saturday, May 3, 2025
- Advertisement -

బండి… ఢిల్లీలో ఎంపీ,తెలంగాణలో కార్పొరేటర్!

- Advertisement -

బండి సంజయ్ ఢిల్లీలో ఎంపీ… తెలంగాణలో కార్పొరేటర్ అన్నారు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి. మీడియాతో మాట్లాడిన కిరణ్ కుమార్ రెడ్డి.. ప్రభుత్వం కోర్టులో కేసు వేయగానే కిషన్ రెడ్డి HCU మీద పెట్టిన పోస్ట్ లు డిలీట్ చేశారు అన్నారు. కిషన్ రెడ్డి ని చూసి మిగతా వారు కూడా పోస్ట్ లు డిలీట్ చేశారు..కేటిఆర్ నెగిటివ్ పాలిటిక్స్,నెగిటివ్ పాలసీలు అంటుండు అన్నారు.

మహిళలకు rtc లో ఉచిత ప్రయాణం, సన్నబియ్యం పంపిణీ,రైతు ఋణమాపి చేయడం,రాంగ్ పాలిసినా కేటిఆర్ చెప్పాలి?.. AI తో లేని బొమ్మలను క్రీయేషన్ చేసి దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ బాధనం చేయాలని చూస్తుండు అన్నారు. ప్రజలను రెచ్చగొట్టడానికి లేనివి ఉన్నవిగా చూపిస్తున్నారు… కేటిఆర్ పెట్టిన ఫొటోలతో కిషన్ రెడ్డీ లాంటి కేంద్ర మంత్రులు ఇరుక్కుంటున్నారు అన్నారు.

2024 లో Gst 42వేల 488 కోట్లు వచ్చింది.. గతం లో కంటే 8శాతం gst గ్రోత్ పెరిగింది అన్నారు. బీజేపీ పాలిత ప్రాంతాల కంటే తెలంగాణ లో పెరిగింది… కవిత తీహార్ నుండి వచ్చాక బయట కనిపించాలని ఎదో ఒకటి మాట్లాడుతుంది అన్నారు. జ్యోతి రావు పేరు పెట్టాలని కవిత అంటుంది… మీనాయన కేసీఆర్ కట్టిన రాజభవనం(ప్రగతి భవనాన్ని) కంచె కూల్చి జ్యోతి రావు పూలే పేరు పెట్టింది నిజం కాదా? చెప్పాలన్నారు.

కేసీఆర్ లాగ ఏక పాత్రాభినయం కాంగ్రెస్ చేయట్లేదు… బండి సంజయ్ తెలంగాణ కు రాగానే కార్పొరేటర్ అయితడు అన్నారు. బండి సంజయ్ CBI ఎంక్వైరీ చేస్తాం అంటుండు… 2003 లో ప్రధాని ఎవరూ? వాజ్ పేయ్ ,సీఎం చంద్రబాబే కదా? చెప్పాలన్నారు. CBI కాదు CBN (చంద్ర బాబు నాయుడు) ఎంక్వైరి చేయించాలి.. ఎంక్వైరి చేస్తే ING సంస్థ ఓనర్ బిల్లి రావును చేయాలి అన్నారు.

గోపాన్ పల్లి లో ఉన్న 400 ఎకరాలను కాపాడింది రేవంత్ రెడ్డి… కేటిఆర్, రేవంత్ రెడ్డి ఒకటేనని బండి సంజయ్ అంటుండు అన్నారు. డిలిమిటేషన్ కోసం చెన్నై పోతే ఒక్కటైనట్లేనా?.. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగొద్దని రేవంత్ రెడ్డి పోరాటం చేస్తుండు అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -