తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను తప్పుదోవ పట్టించడానికి తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని మండిపడ్డారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. బీఆర్ఎస్, బీజేపీ నాయకులు చేసే తప్పుడు ప్రచారం ప్రజలు నమ్మట్లేదని రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్‌కు ట్యాగ్ చేసి మెసేజ్‌లు పంపిస్తున్నారు అన్నారు.
కంచ గచ్చిబౌలిలో ఉన్నవి ప్రభుత్వ భూములని అధికారులకు, బీఆర్ఎస్, బీజేపీ నాయకులకు తెలుసు అన్నారు. మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడిన చామల..ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్నబియ్యం, రాజీవ్ యువ వికాసం లాంటి మంచి కార్యక్రమాలను డైవర్ట్ చేయడానికే ఇదంతా జరుగుతోందన్నారు.
2003లో NDA అలయన్స్ ఉన్నప్పుడే IMGకి భూములు ఇచ్చింది.. BRS ఆ భూముల మీద కన్ను వేయబట్టే ఇన్ని రోజులూ దాని గురించి పట్టించుకోలేదు అన్నారు.
MNC కంపెనీలను తీసుకొచ్చి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని సీఎం రేవంత్ భావిస్తున్నారు.. కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాలు ప్రభుత్వ భూమి కాకపోతే ట్రంప్ దగ్గరకు కూడా పోయేవారు అని ఎద్దేవా చేశారు.