Sunday, May 4, 2025
- Advertisement -

మతాన్ని నమ్మడం..వాడుకోవడం వేరు!

- Advertisement -

ఏపీ సీఎం చంద్రబాబుపై ఎక్స్ వేదికగా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. హిందూ మతాన్ని నమ్మడం…వాడుకోవడం … ఈ రెండు వేరు వేరు అని చంద్రబాబుకు చురకలు అంటించారు. నిజమైన హిందువు దేవుని, హిందూ మతాన్ని నమ్ముకుంటాడు…రాజకీయ అజ్ఞాని…చంద్రబాబు లాంటి వెన్నుపోటుదారులు రాజకీయం చేసి లబ్ధి పొందాలనుకునే వాళ్లు ,,, దేవుడినీ ,,, మతాన్ని వాడుకుంటారు అని దుయ్యబట్టారు

అదే విధంగా మరో ట్వీట్‌లో కపటం, నయవంచనలను మారుపేరైన చంద్రబాబుకు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మూసివేసినా, విక్రయించినా ఏ భావోద్వేగాలు ఉండవు. ఉమ్మడి ఆంధ్ర సిఎంగా 64 ప్రభుత్వ రంగ సంస్థలను అణాకాణీకి అమ్మేసిన చరిత్ర చంద్రబాబుది అని మండిపడ్డారు.

విశాఖ ఉక్కును సెయిల్ లో విలీనం చేస్తామని “కులమీడియా” లో లీకులు ఇస్తూ కార్మికులను గందరగోళం లోకి నెడ్తున్నారు. 4,200 మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించడం చూస్తే చంద్రబాబు కల్లబొల్లి మాయోపాయాలు అర్థమవుతాయి. కాంట్రాక్టు కార్మికులు లేకుండా ఉక్కు ఫ్యాక్టరీ నడవదు. దాన్నో సాకుగా చూపి అమ్మకానికి పెట్టాలన్నది చంద్రబాబు క్షుద్ర ప్రణాళిక అని దుయ్యబట్టారు విజయసాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -