Saturday, May 3, 2025
- Advertisement -

జగన్‌తో ముద్రగడ భేటీ

- Advertisement -

మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్‌తో భేటీ అయ్యారు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం. తాడేపల్లిలోని వైసీపీ క్యాంపు కార్యాలయంలో జగన్‌ కలిశారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిస్థితుల గురించి వీరిద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. పిఠాపురంలో పవన్ కల్యాణ్ భారీ విజయం సాధించడంతో తన ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకున్న సంగతి తెలిసిందే.

అలాగే గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కూడా మద్దతుదారులతో పాటు జగన్‌ను కలిశారు. ఎన్నికల్లో పార్టీ ఓటమికి దారి తీసిన పరిస్థితులపై చర్చించారు. ఇక మూడు రోజుల పాటు జగన్‌ వైఎస్‌ఆర్‌ జిల్లాలో పర్యటించనున్నారు. ఈనెల 8న తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో నివాళి అర్పించనున్నారు జగన్.

ఇక రాష్ట్రంలో జరుగుతున్న దాడులపై జగన్ తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. నెల్లూరు సెంట్రల్ జైలులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని కలిశారు. అనంతరం ఉద్దేశ పూర్వకంగా జరుగుతున్న దాడులను ఖండించారు. టీడీపీకి ఓటు వేయని వారిని లక్ష్యంగా చేసుకుంటు దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. దాడులకు ఫుల్‌స్టాఫ్ పెట్ట‌క‌పోతే రియాక్షన్ అంతే గట్టిగా ఉంటుందని హెచ్చరించారు జగన్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -