- Advertisement -
తిరుమల లడ్డూ వివాదంపై స్పందించారు మెగాబ్రదర్ నాగబాబు. ఈ విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాంట్లో ఎలాంటి తప్పులేదని వ్యాఖ్యానించారు. అన్ని మతాలతో కలిసి ఉండే వ్యక్తి పవన్ అని అన్నారు. హిందూ ధర్మ రక్షణ మండలి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
చట్టం తన పని తాను చేసుకుపోతుందని, దోఘులెవరున్నా బయటకు వస్తారని, శిక్ష పడుతుందన్నారు. పవన్ కల్యాణ్ అసలైన సెక్యులర్ అని …తన తమ్ముడు పవన్‌ను విమర్శించేవారు సూడో సెక్యులర్స్ అంటూ మండిపడ్డారు.
హిందూ ధర్మం ప్రమాదంలో ఉందనడానికి లడ్డూ అంశం క్లైమాక్స్ లాంటిదని అని చెప్పుకొచ్చారు. హిందూ దేవాలయాలు, ధార్మిక మండళ్లు హిందువులే నిర్వహించాలన్నారు. ప్రభుత్వాల నిర్ణయాలు కోట్లాది మంది హిందువులపై ప్రభావం చూపుతున్నాయనేదే పవన్ బాధ అని చెప్పారు.