ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొణిదల నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి వనితారాణికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. నాగబాబు అభ్యర్థిత్వాన్ని మంత్రి నారా లోకేష్ బలపరిచారు.
నాగబాబు నామినేషన్ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేష్, నాదెండ్ల మనోహర్, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన నాగబాబు ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు, నారా లోకేష్‌కు ధన్యవాదాలు తెలిపారు.
ఏపీలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ వెలువడగా ఒక్క నాగబాబు పేరు మాత్రమే ఖరారైంది. మిగితా నాలుగు స్థానాలకు అభ్యర్థులను త్వరలోనే ప్రకటించనున్నారు. త్వరలోనే ఏపీ కేబినెట్‌లో చేరనున్నారు నాగబాబు.