Saturday, May 3, 2025
- Advertisement -

జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు

- Advertisement -

ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరు ఖరారైంది. ఏపీలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ నెల 10వ తేదీతో నామినేషన్ల దాఖలుకు గడువు పూర్తికానుంది. ఈనెల 20న పోలింగ్ జరగనుంది.

ప్రస్తుతం నాగబాబు రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శిగా సేవలందిస్తున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని నాగబాబుకు పవన్ కళ్యాణ్ సమాచారం ఇచ్చారు. నామినేషన్ కు అవసరమైన పత్రాలు సిద్ధం చేయాలని పార్టీ కార్యాలయ సిబ్బందిని పవన్ కల్యాణ్ ఆదేశించారు.

ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకొనే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ విషయంపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కొద్దిరోజులుగా ఎమ్మెల్సీగా నాగబాబు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. నాగబాబు పేరును ఖరారు చేయడంతో జనసైనికుల్లో ఆనందం వెల్లి విరుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -