ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం వేదికగా జనసేన 12వ ఆవిర్భావ వేడుకలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్, నాగబాబు చేసిన కామెంట్స్ కాక పుట్టిస్తున్నాయి.
ముఖ్యంగా నాగబాబు చేసిన కామెంట్స్ టీడీపీ నేతలకు ఆగ్రహం తెప్పించాయి. నాలుగు దశాబ్దాల తెలుగు దేశం పార్టీని నిలబెట్టామని కామెంట్ చేశారు నాగబాబు. అంతేగాదు పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఎవరైనా తామే గెలిపించామనుకుంటే అది వారి ఖర్మ అన్నారు నాగబాబు.
పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలుపులో రెండు నిజాలు ఉన్నాయన్నారు. ఒకటి పవన్ కల్యాణ్ అయితే రెండోది పిఠాపురం జనసైనికులు, ఓటర్లు అని వ్యాఖ్యానించారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పాత్ర లేదని తేల్చి పడేశారు. నాగబాబు చేసిన ఈ వ్యాఖ్యలు కూటమిలో చిచ్చు పెట్టేలా ఉన్నాయి.
వాస్తవానికి పిఠాపురం సీటును ఆశీంచారు వర్మ. అంతేగాదు తనకంటూ ఓ అనుచరగణం కూడా ఉంది. చివరి వరకు పిఠాపురం సీటు కోసం ప్రయత్నించారు వర్మ. కానీ పవన్‌కే సీటు దక్కినా జనసేనాని గెలుపులో కీలకపాత్ర పోషించారు. ఇదే విషయాన్ని పవన్ సైతం పరోక్షంగా ఒప్పుకున్నారు కూడా. కానీ ఇప్పుడు నాగబాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు అందరికి ఆగ్రహం తెప్పిస్తుండగా వర్మ ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.