Saturday, May 3, 2025
- Advertisement -

కొండా సురేఖపై నాగ్ పరువు నష్టం దావా

- Advertisement -

అక్కినేని ఫ్యామిలీ, సమంతపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. సినిమా ఇండస్ట్రీ మొత్తం ఏకతాటిపైకి వచ్చి మంత్రి సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబడుతున్నారు. సురేఖ సారీ చెప్పిన ఆమెపై విమర్శలు ఆగడం లేదు. కొండా మూవీ ఫ్యామిలీతో సినిమా చేసిన ఆర్జీవీ సైతం సురేఖ వ్యాఖ్యలను ఏకిపారేశారు. నాగార్జున ఈ విషయంలో సీరియస్‌గా స్పందించాలన్నారు వర్మ.

ఇక తాజాగా కొండా సురేఖ చేసిన కామెంట్స్‌పై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు నాగార్జున. నాంపల్లి కోర్టులో పరువునష్టం దాఖలు చేశారు వేశారు. కొండా సురేఖ తమ కుటుంబ పరువుప్రతిష్ఠలను దెబ్బతీశారని పిటిషన్ వేశారు. దీనిపై శుక్రవారం విచారణ జరపనుంది న్యాయస్థానం.

వరంగల్‌లో అక్కినేని ఫ్యాన్స్ నిరసన చేపట్టారు. మంత్రి కొండా దిష్టిబొమ్మను దగ్దం చేశారు. ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సురేఖపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో బీఆర్‌ఎస్‌ మహిళా కార్పొరేటర్లు ఫిర్యాదు చేశారు. సురేఖ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయగా కొండా సురేఖ మాత్రం కేటీఆరే తనకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం విశేషం. ఇక కేటీఆర్ పంపిన లీగల్ నోటీసులను న్యాయపరంగానే ఎదుర్కొంటానని వెల్లడించారు సురేఖ.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -