బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సవాల్ విసిరారు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. కాళోజీ పేరుతో రాజకీయం చేయడం సరికాదని హెచ్చరించారు. కేటీఆర్‌కు దమ్ముంటే ఆదివారం హన్మకొండ నయీమ్ నగర్ నాలా బ్రిడ్జి మీదకు రావాలని సవాల్ విసిరారు.
ప్రజలు ఎవరి మీద పూల వర్షం కురిపిస్తారో…ఎవరి మీద రాళ్ల వర్షం కురిపిస్తారో తెలుస్తుందన్నారు. కేటీఆర్ రాజకీయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడని…ఇలానే మాట్లాడితే నీ కుటుంబ చరిత్ర గురించి మాట్లాడాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు నాయిని.
నాలా పనులు పూర్తి అయ్యే వరకు దగ్గరుండి పని చేయించాను అని..అది చూసిన జనం నాకు సన్మానం చేశారు అన్నారు. వాడు వీడు అని సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడటం మంచి పద్ధతి కాదు అని..ఎలాంటి కబ్జాలు లేకుండా ఇప్పుడు వరంగల్ చాలా ప్రశాంతంగా ఉందన్నారు. కాళోజీ పేరుతో రాజకీయం చేయడం సిగ్గు చేటు అన్నారు. కేటీఆర్ ఆదివారం హన్మకొండకు వచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.