Saturday, May 3, 2025
- Advertisement -

లోకేష్‌..పంచాయతీరాజ్‌ శాఖ మంత్రా?

- Advertisement -

తెలుగు తమ్ముళ్ల అత్యుత్సాహం తెలుగుదేశం పార్టీ పరువును బజారుకు ఈడుస్తోంది. ఎందుకంటే ఏ శాఖకు ఎవరు మంత్రులే తెలియని స్థితిలో ఉన్నారు టీడీపీ నేతలు, కార్యకర్తలు. నారా లోకేష్ పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ శాఖలను నారా లోకేష్‌కు ఇచ్చేశారు తెలుగు తమ్ముళ్లు.

ఇందుకు సంబంధించి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పేపర్లో యాడ్స్ వేశారు తెలుగు తమ్ముళ్లు. ఇది చూసిన వాళ్లంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఏకంగా పవన్ కళ్యాణ్ మంత్రి పదవికి ఎసరు పెడుతున్నారని పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

ఇక మరికొంతమందైతే గతంలో పవన్ చేసిన కామెంట్స్‌ను గుర్తు చేస్తున్నారు. వైసీపీ పాలనలో ఏ శాఖకు ఎవరు మంత్రో తెలియని పరిస్థితి ఉండేదని పవన్ చేసిన మాటలను గుర్తు చేస్తూ ఇప్పుడు కూటమి పాలనలో జరుగుతుంది ఏంటో చెప్పాలని చురకలు అంటిస్తున్నారు. మొత్తంగా తెలుగు తమ్ముళ్లు వేసిన పోస్టర్స్ మాత్రం కూటమి నేతల్లో చర్చనీయాంశంగా మారాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -