114 మంది అసెంబ్లీ అభ్యర్థులతో కాంగ్రెస్ తొలి జాబితా విడుదలైంది. ఇక త్వరలోనే రెండో జాబితా రిలీజ్ కానుంది. ఇందులో నెల్లూరు సిటీ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది.
పొత్తులో భాగంగా నెల్లూరు నగర సీటును సీపీఎంకు ఇవ్వాలని కాంగ్రెస్ భావించినా, చివరి నిమిషంలో ఆ నిర్ణయం మార్చుకున్నట్లు సమాచారం. ఈ స్థానానికి కాంగ్రెస్ నుండి నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి పేరును ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కిరణ్ కుమార్ రెడ్డి.
1952లో నెల్లూరు అసెంబ్లీ సెగ్మెంట్ ఏర్పడగా కాంగ్రెస్ ఏడుసార్లు గెలిచింది. ఆనం చెంచు సుబ్బారెడ్డి (1955), జిసి కొండయ్య (1962), ఆనం వెంకట రెడ్డి (1972), కెవి సుబ్బారెడ్డి (1978 మరియు 1985), ఆనం రామనారాయణ రెడ్డి (1999), ఆనం వివేకానంద రెడ్డి (1999 మరియు 2004). 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి పోలుబోయిన అనిల్‌కుమార్ యాదవ్ విజయం సాధించారు. ఈసారి కూడా విజయం వైసీపీనే వరించడం ఖాయంగా తెలుస్తోంది.